COVID-19 Fourth Wave: కరోనా ఫోర్త్‌వేవ్ తప్పదా ! డబ్ల్యూహెచ్‌వో కూడా అదే హెచ్చరిక

COVID-19 Fourth Wave: ఇండియాలో కరోనా ఫోర్త్‌వేవ్ తప్పదనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. నిన్న కాన్పూర్ ఐఐటీ  పరిశోధకుల హెచ్చరిక..ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఈసారి వేరియంట్ మరింత తీవ్రంగా సంక్రమించనుందనేది డబ్ల్యూహెచ్‌వో ఆందోళన.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 28, 2022, 10:39 PM IST
  • కరోనా ఫోర్త్‌వేవ్‌పై నిన్న కాన్పూర్ ఐఐటీ, నేడు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
  • జూన్ 22 న ప్రారంభమై...ఆగస్టు 23 నాటికి పీక్స్‌కు చేరనున్న ఫోర్త్‌వేవ్
  • కరోనా ఫోర్త్‌వేవ్ తీవ్రత అప్పుడే అంచనా వేయలేమంటున్న పరిశోధకులు
COVID-19 Fourth Wave: కరోనా ఫోర్త్‌వేవ్ తప్పదా ! డబ్ల్యూహెచ్‌వో కూడా అదే హెచ్చరిక

COVID-19 Fourth Wave: ఇండియాలో కరోనా ఫోర్త్‌వేవ్ తప్పదనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. నిన్న కాన్పూర్ ఐఐటీ  పరిశోధకుల హెచ్చరిక..ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఈసారి వేరియంట్ మరింత తీవ్రంగా సంక్రమించనుందనేది డబ్ల్యూహెచ్‌వో ఆందోళన.

కరోనా థర్డ్‌వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు కరోనా ఫోర్త్‌వేవ్ ఆందోళన రేగుతోంది. జూన్ నుంచి ముఖ్యంగా జూన్ చివరి వారం నుంచి కరోనా ఫోర్త్‌వేవ్ ప్రారంభం కానుందనే వార్తలు కలవరం కల్గిస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి ఇండియాలో జూన్ 22 నుంచి ప్రారంభమై...ఆగస్టు నాటికి పీక్స్‌కు చేరుతుందని ఇప్పటికే కాన్పూర్ ఐఐటీ అంచనా వేసింది. ఫోర్త్‌వేవ్ నాలుగు నెలలపాటు ఉంటుందని కూడా కాన్పూర్ ఐఐటీ పరిశోధకుల అధ్యయనం తేల్చింది. 

కాన్పూర్ ఐఐటీ మేథమేటిక్స్, స్టాటిస్టిక్స్ విభాగానికి చెందిన సబరా పర్షద్ రాజేష్ భాయి, సుభ్రా శంకర్ ధార్, షలభ్‌లు ఈ అధ్యయనం చేశారు. అయితే ఫోర్త్‌‌‌వేవ్ అనేది కరోనా వైరస్ వేరియంట్ తీవ్రత, వ్యాక్సినేషన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. అంటే జనవరి 30, 2020లో తొలి కేసు నమోదైన 936 రోజుల తరువాత ఫోర్త్‌వేవ్ రావచ్చనేది అంచనా. ఈ లెక్క ప్రకారం జూన్ 22న ఫోర్త్‌వేవ్ ప్రారంభం కానుంది. ఆగస్టు 23 నాటికి పీక్స్‌కు చేరి..అక్టోబర్ 24, 2022 నాటికి అంతం కానుంది. అయితే కరోనా వైరస్ కొత్త వేరియంట్ ప్రభావం ఈ మొత్తం విశ్లేషణను దాటి కూడా ఉండే అవకాశాలున్నాయని పరిశోధకులు తెలిపారు. ఈ ప్రభావమనేది వివిధ కారణాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

అదే సమయంలో కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు, రెండవ డోసు, బూస్టర్ డోసులు కూడా ఇన్‌ఫెక్షన్ తీవ్రతపై ప్రభావం చూపిస్తాయని కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా ఒమిక్రాన్ వేరియంట్ చివరిది కాదని..తరువాత వచ్చే వేరియంట్ మరింత తీవ్రంగా సంక్రమించేది కావచ్చని హెచ్చరించారు. తదుపరి వచ్చే వేరియంట్ శక్తివంతంగా మరింత తీవ్రంగా సంక్రమించేది అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ టెక్నికల్ లీడ్ మారియా వాన్ కెర్ఖోవ్ స్పష్టం చేశారు. ఇదే రీసెర్చ్ బృందం కరోనా థర్డ్‌వేవ్ ఇండియాలో ఫిబ్రవరి 3 నాటికి పీక్స్‌కు వెళ్తుందని హెచ్చరించిన పరిస్థితి ఉంది. 

ఇండియాలో కోవిడ్ 19 డేటా ఆధారంగా దేశంలో కరోనా ఫోర్త్‌వేవ్ ఎప్పుడు రావచ్చనేది పరిశోధకులు అంచనా వేశారు. దేశంలో ఫోర్త్‌వేవ్, ఇతర దేశాల్లో ఇతర వేవ్స్‌ను లెక్కగట్టేందుకు ఇదే విధానం అవలంభించవచ్చని పరిశోధకులు చెప్పారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే వంటి దేశాల్లో ఫోర్త్ , ఫిఫ్త్ వేవ్‌లు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. జింబాబ్వే డేటా ఆధారంగా ఇండియాలో థర్డ్‌‌వేవ్ అంచనా వేశారు. ఇప్పుడీ థర్డ్‌వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఫోర్త్‌వేవ్ అంచనా కూడా సరైందేనని తెలుస్తోంది. 

Also read: Green Tea Side Effects: అతిగా గ్రీన్ టీ తాగితే ఈ అనారోగ్య సమస్యలు ఎదుర్కొక తప్పవు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News