COVID-19 updates: Pregnant ladies కి షాకింగ్ న్యూస్ !

COVID-19 effects on Pregnant women: కరోనావైరస్ మహమ్మారి చాలామంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఒకానొక దశలో కరోనా పేరెత్తితే చాలు భయంతో వణికిపోయే దుస్థితి ఏర్పడింది. మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేసిన ఈ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూనే ఒక సంవత్సరం గడిచిపోయింది.

Last Updated : Jan 29, 2021, 06:47 PM IST
COVID-19 updates: Pregnant ladies కి షాకింగ్ న్యూస్ !

COVID-19 effects on Pregnant women: కరోనావైరస్ మహమ్మారి చాలామంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఒకానొక దశలో కరోనా పేరెత్తితే చాలు భయంతో వణికిపోయే దుస్థితి ఏర్పడింది. మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేసిన ఈ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూనే ఒక సంవత్సరం గడిచిపోయింది. అయినప్పటికీ... కరోనా గురించి ఇప్పటికీ అనేక సందేహాలు, భయాందోళనలు ఇప్పటికీ ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా గర్భిణులు కరోనా గురించి చాలా ఆందోళన చెందుతున్నారు.  COVID-19 బారిన పడిన గర్భిణీ స్త్రీలపై కరోనా తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుందని.. ఊహించిన దానికంటే ఎక్కువ హాని జరుగుతుందంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

అమెరికన్ జర్నల్ ఆఫ్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం కొవిడ్-19 బారిన పడిన గర్భిణులకు కరోనా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని తేలింది. కరోనావైరస్ మరణాల రేటు సాధారణ వ్యక్తులతో పోల్చుకుంటే గర్భిణీ స్త్రీలలో 13 రెట్లు అధికంగా ఉందని ఈ అధ్యయనంలో కనుగొన్నారు. Coronavirus అనుబంధ సమస్యలతో మృతి చెందిన గర్భిణి స్త్రీల మరణాలు సంఖ్య సైతం పూర్తి స్థాయిలో నమోదు కాలేదని ఈ అధ్యయనం అభిప్రాయపడింది. 

Also read : Eating more salt: ఉప్పు ఎక్కువగా తింటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా ?

"గర్భిణీ రోగులపై కరోనా ప్రభావం అంచనా వేసిన దానికంటే ఎక్కువగానే ఉంది" అని అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు క్రిస్టినా ఆడమ్స్ వాల్డోర్ఫ్ తెలిపారు. వాషింగ్టన్ ఆధారిత అధ్యయనం ప్రకారం, కొరోనావైరస్ బారిన పడిన Pregnant ladies అనారోగ్యం సమస్యలతో ఆసుపత్రిలో చేరే ప్రమాదం 3.5 రెట్లు అధికంగా ఉందని అంచనా వేశారు.

ప్రసూతి మరణాల రేటు వార్షిక జననాల కంటే ఎక్కువ
ఈ అధ్యయనంలో భాగంగా గతేడాది జూన్‌లో కరోనావైరస్ సంక్రమించిన 240 మంది గర్భిణీ స్త్రీల డేటాను పరిశోధకుల బృందం విశ్లేషించింది. వీరిలో ముగ్గురు మహిళలు కరోనావైరస్‌తో మరణించగా, 24 మంది రోగులు అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనట్టు వెల్లడైంది. అక్టోబర్ మధ్య నాటికి కరోనా వ్యాధి లక్షణాలతో బాధపడుతూ మృతి చెందిన గర్భిణీల మరణాల సంఖ్య 6.7 శాతంగా నమోదైంది. 

Also read : Ginger health benefits: అల్లం రోజూ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..

కరోనా పట్ల గర్భిణీలకు మొదట్లో అంతగా లేని ఆందోళన.. 
కరోనా మహమ్మారి వ్యాపించడం మొదలైనప్పటి నుండి COVID-19 తో వచ్చే ప్రధాన సమస్యలను గుర్తించడానికి శాస్త్రవేత్తలు తీవ్ర కృషి చేస్తూనే ఉన్నారు. వృద్ధులు, సుదీర్ఘ వ్యాధులు ఉన్నవారు సంక్రమణ కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని గుర్తించారు కానీ తాజా పరిశోధనల అనంతరం గర్భం కూడా Coronavirus risk factors లో ఒకటైంది. కరోనా వ్యాపించాకా తొలి 8 నెలల కాలంలో Pregnant women కు కరోనాతో ప్రత్యేకంగా వచ్చే ముప్పు ఏదీ లేదనే అనుకున్నారు కానీ ఇకపై గర్భం దాల్చనున్న మహిళలకు కరోనాతో కష్టాలు తప్పవని అధ్యయనాలు చెబుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News