Cardamom For Skin: ఏలకుల్లో చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. ఇవి రుచిని పెంచడమేకాకుండా ఆరోగ్యానికి చాలా రకాల ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే మూలకాలు చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి చర్మంపై అలర్జీ, ఇతర సమస్యలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ముఖంపై మెరుపును కూడా పెంచుతుంది. అయితే ఏలకుల్లో చాలా రకాల ఏలకులు మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఎలాంటి ఏలకులు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
చర్మం స్క్రబ్ కోసం పెద్ద ఏలకులు:
ఏలకులను చర్మంపై స్క్రబ్ కోసం కూడా వినియోగించవచ్చని ఆయుర్వేద శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇది చర్మం నుంచి మృతకణాలను కూడా సులభంగా తొలగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులోయాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇది చర్మం లోపలి నుంచి శుభ్రపరుస్తుంది.
రక్త ప్రసరణ:
పెద్ద ఏలకులు రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడతాయి. పెద్ద ఏలకులకుల్లో ఉండే గుణాలు శరీరంలో టాక్సిన్స్ తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఇది చర్మాన్ని కూడా డిటాక్సిఫై చేస్తుంది. అంతేకాకుండా చర్మంలో రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది.
మొటిమలు దూరమవుతాయి:
చాలా మంది వాతావరణ కాలుష్యం కారణంగా మొటిమల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉండే పెద్ద ఏలకులను తీసుకోవాలి. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ ముఖంపై మచ్చలను తేలికపరుస్తాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలు రాకుండా నివారిస్తాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Kalpika Ganesh Pics: కల్పిక గణేష్ హాట్ ఫొటోస్.. తెలుగమ్మాయిని ఇలా ఎప్పుడూ చూసుండరు!
Also Read: Actor Ali: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ సలహాదారుడిగా అలీ నియామకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook