Heart Healthy Vegetable: మన డైట్లో ఎక్కువ శాతం ఆకుకూరలు, కూరగాయలు ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. దీంతో మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే, క్యాబేజీని కూడా మనం తప్పనిసరిగా తినాలట. ఇందులో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు క్యాబేజీలో ఫైబర్, విటమిన్ కే, సీ కూడా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా మంచిది. ప్రాణాంతక గుండె, క్యాన్సర్ సమస్య నుంచి మనల్ని కాపాడుతుంది.
క్యాబేజీలో అధికశాతం నీరు ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మనకు రోజంటికీ కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. బరువు నిర్వహణలో ఉన్నవారు క్యాబేజీని తినాలి. దీన్ని పచ్చిగా సలాడ్, సూప్స్ చేసుకోవాలి. క్యాబేజీతో రకరకాల కూరగాయలు కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
డయాబెటీస్..
యాంటీహైపర్‌గ్లైసెమిక్ గుణం క్యాబేజీ కలిగ ఉంటుంది. ఇది డయాబెటీస్ వారికి మంచిది. డయాబెటీస్ నెఫ్రోపతి నుంచి కాపాడుతుంది. ఇది రక్తంలో చక్కెరస్థాయిలను నిర్వహిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. షుగర్ వ్యాధి గ్రస్థులు తప్పకుండా వారి డైట్లో క్యాబేజీని డైట్లో చేర్చుకోవాలి.
ఇదీ చదవండి: రోజ్ వాటర్ ఛాలెంజ్.. 15 రోజుల్లో మీ ముఖం మెరిసిపోవడం ఖాయం..!
కేన్సర్..
క్యాబేజీలో గ్లూకోసైనోలేట్స్, సల్ఫర్ ఉంటుంది. అంతేకాదు క్యాబేజీలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కేన్సర్ ను నివారిస్తుంది అని వెబ్ ఎండీ తెలిపింది. క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా చేస్తుంది. క్యాబేజీ అన్ని సీజన్లలో మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటుంది.
జీర్ణక్రియ..
ఫైబర్ పుష్కలంగా ఉండే క్యాబేజీ చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.ఇది కడుపు అల్సర్ రాకుండా చేస్తుంది. క్యాబేజీని డైట్లో చేర్చుకోవడం వల్ల మన శరీర పనితీరు కూడా మెరుగవుతుంది. ఫైబర్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా మీ దరిచేరదు.
శరీరంలో మంట వాపు సమస్యలకు కూడా క్యాబేజీ చెక్ పెడుతుంది. దీంతో కేన్సర్, గుండె సమస్యలు, డయాబెటీస్, అల్జీమర్స్‌తో బాధపడేవారికి ఎంతో ఆరోగ్యం.
ఇదీ చదవండి: మారుతున్న సీజన్లో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఈ 5 జాగ్రత్తలు తీసుకోండి..
గుండె ఆరోగ్యం..
క్యాబేజీలో ఆంథోసైనిన్స్ ఉంటాయి. ఆర్థ్రరైటీస్ సమస్యలకు చెక్ పెడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు బీపీని తగ్గిస్తుంది. దీంతో గుండె సమస్యలకు చెక్ పెడుతుంది. ముఖ్యంగా క్యాబేజీ మహిళలకు వరం కంటే తక్కువ కాదు అని ఎన్ ఐ హెచ్ నివేదిక తెలిపింది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter