Blood Donation Tips: రక్తదానం ఓ అద్బుతమైన పుణ్యకార్యం. ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు చాలా అవసరం ఇది. మొదటిసారి రక్తదానం చేసేటప్పుడు కాస్త ఆందోళన ఉండటం సహజం. అసలు రక్తదానం చేసే ప్రక్రియ ఎలా ఉంటుంది, ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఎవరెవరు రక్తం దానం చేయవచ్చో తెలుసుకుందాం.
రక్తం దానం చేసేటప్పుడు మీకు ఆ అర్హత అంటే యోగ్యత ఉందో లేదో చూసుకోవాలి. వయస్సు, బరువు, ఆరోగ్యం వంటి ప్రాధమిక అంశాలకు లోబడి ఉండాలి. బ్లడ్ డొనేషన్ కేంద్రాన్ని సంప్రదించి మీరు ఆ అర్హత ఉందో లేదో తెలుసుకోవచ్చు. రక్తం దానం చేయడానికి ముందు, తరువాత శరీరంలో నీటి కొరత లేకుండా చూసుకోవాలి. రక్తం దానం చేయడానికి ఒక రోజు ముందు, ఒక రోజు తరువాత నీళ్లు ఎక్కువగా తాగాలి.
రక్తం తయారయ్యేందుకు వీలుగా ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తినాలి. ముఖ్యంగా పాలకూర, బీన్స్, సాల్మన్ ఫిష్, చికెన్ వంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. దానం చేయడానికి ముందు రాత్రి నిద్ర బాగుండాలి. ఫలితంగా ఫ్రెష్‌నెస్ ఉంటుంది. వదులైన దుస్తులు ధరించాలి. ప్రత్యేకించి హ్యాండ్స్ ఫ్రీ దుస్తులుంటే మంచిది.
రక్తదానం చేసేటప్పుడు రక్తాన్ని పరీక్షిస్తారు. మీ ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే రక్తదానం చేసేందుకు అర్హత ఉంటుంది. స్క్రీనింగ్ సందర్భంగా మీ ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు దాచకుండా అందించాలి. లేకపోతే మీ రక్తం తీసుకునే రోగి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
రక్తదానం చేసేటప్పుడు ప్రశాంతంగా, టెన్షన్ లేకుండా ఉండాలి. రక్తదానం పూర్తయ్యాక 10-15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. రక్తం దానం చేశాక తగినన్ని నీళ్లు పుష్కలంగా తాగాలి. ఆరోగ్యంగా ఉంటేనే రక్తం దానం చేయాలి.
Also read: IT Returns 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇలా చేస్తే 40 వేలవరకూ ప్రయోజనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook