Heart Attack: గుండెపోటు సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ ఫుడ్ ఎంతో బెస్ట్

Foods That Prevent Heart Attack: ప్రస్తుతం చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. దీని కారణం మనం తీసుకొనే ఆహార పదార్థాలు. అయితే గుండె జబ్బుల నుంచి బయట పడాలి అనుకొనేవారు ఈ ఫుడ్‌ తీసుకోవడం చాలా మంచిది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2024, 08:20 PM IST
Heart Attack: గుండెపోటు సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ ఫుడ్ ఎంతో బెస్ట్

Foods That Prevent Heart Attack: ఆధునిక జీవశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు అధిక కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం శరీరానికి మంచిది కాదు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. కూరగయాల్లో లభించే కాకర కాయను తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. 

 కాకరకాయ తినడానికి చేదుగా ఉంటుందని చాలా మంది తినకుండా ఉంటారు. కానీ దీని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా కాకరకాయ గింజలు శరీరానికి ఎంతో ఉపయోగపడుతాయి. గింజలను తినడం వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా హార్ట్ ఎటాక్ వంటివి వ్యాధుల నుంచి కాపాడుతుంది.  

అంతేకాకుండా రక్తంలోని షుగర్‌ లెవెల్స్‌ను కంట్రోల్‌ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యతో బాధపడుతున్నవారు ఈ కాకరకాయను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. . బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఫుడ్ కాకరకాయ అని చెప్పవచ్చు. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి పెరిగి మనిషి ఆరోగ్యంగా ఉంటారట.

అలాగే కాకరకాయ గింజలు తినడం వల్ల జలుబు, కఫం, ముక్కు దిబ్బడ, వంటి సమస్యలు నుంచి కాపాడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.  కాకరకాయ తీసుకోవడం వల్ల కడుపులోని పురుగులు కూడా తొలుగుతాయి. దీని వల్ల ఎలాంటి కడుపు సంబంధిత సమస్యల బారిన పడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి కాకరకాయను మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం చాలా అవసరం. మీరు కూడా ప్రతిరోజు కాకరకాయ కూర, జ్యూస్‌ ఇతర పదార్థాలు తినడం వల్ల అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటారు. కాకరకాయ డయాబెటిస్‌ వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఉదయం కాకరకాయ జ్యూస్‌ తీసుకోవడం చాలా మంచిది. కాకరకాయ నచ్చని వాళ్ళు కాకరకాయతో తయారు చేసే చిరుతిండిని తీసుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి అనారోగ్యసమస్యలు కలగవు.  

Also Read : Jio Bharat b2: 343 గంటల స్టాండ్‌బై బ్యాటరీతో మార్కెట్‌లోకి Jio Bharat B2 మొబైల్‌..ఫీచర్స్‌, ధర వివరాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News