భోజనం ఎక్కువగా తినడం కన్నా అల్పాహారం (Breakfast) అధిక మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని తాజా అధ్యయనంలో తేలింది. బ్రేక్ ఫాస్ట్ ఎక్కువగా తినడం వల్ల స్థూలకాయం (Obesity), షుగర్ తో పాటు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను పరిష్కరించవచ్చునని ‘ద జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినోలాజీ అండ్ మెటబాలిజమ్’ అనే జర్నల్‌లో ప్రచురించారు. బీ అలర్ట్.. గంటల తరబడి కూర్చుంటున్నారా! ఇది చదవండి
తక్కువ కేలరీల అల్పాహారం, అధిక కేలరీలలో భోజనాన్ని 16 మంది పురుషులకు మూడు రోజుల పాటు అందించారు. మరో మూడు రోజులపాటు అధిక కేలరీల బ్రేక్ ఫాస్ట్, తక్కువ కేలరీల భోజనం సమకూర్చి రీసెర్చ్ చేశారు. అధిక కేలరీల బ్రేక్‌ఫాస్ట్ తిన్న సందర్భంలో థర్మోజెనిసిస్‌ను తయారుచేసిందని జర్మనీలోని లూబెక్ యూనివర్సిటీ ప్రొఫెసర్, రచయిత జూలియన్ రిక్టర్ తెలిపారు. తొడలు లావుగా ఉన్నాయా.. అయితే మీకు శుభవార్త
అల్పాహారం తగినంత తినడం వల్ల కలిగే ప్రయోజనాన్ని ఇది మరోసారి రుజువు చేసిందన్నారు. పోషకాలు శోషణ, జీర్ణక్రియ, ఆహారాన్ని జీర్ణం చేసినప్పుడు మానవ శరీరం అధిక శక్తి (కేలరీలను) ఖర్చు చేస్తుంది. ఈ ప్రక్రియను ఆహార ప్రేరిత థర్మోజెనిసిస్ (డీఐటీ) అని పిలుస్తారు. మనం ఆహారం తీసుకునే సమయాన్ని బట్టి జీర్ణక్రియ, డీఐటీలో వ్యత్యాసం ఉంటుంది. రాత్రి తీసుకునే భోజనం కన్నా ఉదయం వేళ అధికంగా కేలరీలు తీసుకోవాలని, ఆ సమయంలో డీఐటీ 2.5రెట్లు అధికంగా జరుగుతుందని రిక్టర్ తెలిపారు. ఉప్పు.. ఆరోగ్యానికి పెద్ద ముప్పు!
ముఖ్యంగా రాత్రి భోజనంలా కాకుండా ఉదయం తీసుకునే అల్పాహారం రక్తంలో షుగర్ స్థాయిని, ఇన్సూలిన్‌ను నియంత్రిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. తక్కువ కేలరీలున్న టిఫిన్ తినడం వల్ల ఆకలి పెరుగుతుందని, తద్వారా స్వీట్లు తినాలనిపిస్తుందని జర్నల్‌లో పేర్కొన్నారు. హీరోయిన్ హాట్ ఫొటోలతో ‘హార్ట్ ఎటాక్’!
ఊబకాయులతో పాటు ఫిట్‌గా ఆరోగ్యంగా ఉన్నవారికి సైతం అల్పాహారం అధిక మోతాదులో తీసుకోవాలని తాము సిఫారసు చేస్తున్నామని చెప్పారు. దీని వల్ల జీర్ణక్రియ సాఫీగా జరిగి బరువు తగ్గడం, ఇతరత్రా అనారోగ్య సమస్యలు మన దరిచేరవని ప్రొఫెసర్ రిక్టర్ వివరించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..