Covid19 Nasal Vaccine: కోవిడ్ బూస్టర్ డోసుగా నాసల్ వ్యాక్సిన్, ధర ఎంతో తెలుసా

Covid19 Nasal Vaccine: కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. పొరుగుదేశం చైనా నుంచి భారీగా ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా బూస్టర్ డోస్ ప్రాధాన్యత పెరిగింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 27, 2022, 05:42 PM IST
Covid19 Nasal Vaccine: కోవిడ్ బూస్టర్ డోసుగా నాసల్ వ్యాక్సిన్, ధర ఎంతో తెలుసా

చైనా సహా ప్రపంచదేశాల్ని కోవిడ్ 19 వణికిస్తోంది. చైనాలో పరిస్థితి అత్యంత దారుణంగా మారుతున్న క్రమంలో కరోనా వ్యాక్సినేషన్ మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా బూస్టర్ డోసు తక్షణం వేయించుకోవల్సిన అవసముందనే వాదన విన్పిస్తోంది.

చైనా కోవిడ్ 19 కేసుల నేపధ్యంలో ఇండియా అలర్ట్ అయింది. కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాలనే వాదన విన్పిస్తోంది. ఇప్పటికే దేశీయ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్‌ను 18 ఏళ్ల పైబడినవారికి బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పుడు నాసల్ వ్యాక్సిన్ ధరను భారత్ బయోటెక్ కంపెనీ ప్రకటించింది.  ప్రైవేటు కంపెనీలకు సింగిల్ డోసు నాసన్ వ్యాక్సిన్ ధర 800 రూపాయలు కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 325 రూపాయలకే విక్రయించనుంది.

కొత్త ఏడాదిలో జనవరి చివరి వారం నుంచి ఈ నాసల్ వ్యాక్సిన్ ఇంకోవాక్ అందుబాటులో రానుంది. కోవిన్ పోర్టల్ ద్వారా ఇప్పట్నించే బూస్టర్ డోసు కోసం స్లాట్ బుకింగ్స్ చేసుకోవచ్చు. కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ రెండు డోసులు పొందినవారు బూస్టర్ డోసుగా ఇంకోవాక్ నాసల్ వాక్సిన్ తీసుకోవచ్చు. ప్రాధమిక, బూస్టర్ డోసుకై అనుమతి పొందిన ప్రపంచపు తొలి నాసల్ వ్యాక్సిన్‌గా ఇంకోవాక్ నిలిచింది.

Also read: Diabetes Weight Loss: శాశ్వతంగా మధుమేహం, అధిక బరువు సమస్యలకు 12 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News