Fungal Infections: వర్షాకాలం వచ్చిదంటే చాలు ఆరోగ్యపరంగా చాలా సంరక్షణ చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించుకోవాలి. ముఖ్యంగా కాళ్లలో ఏర్పడే ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు ప్రధాన సమస్యగా ఉంటాయి..
వర్షాకాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరమౌతుంది. ఎందుకంటే తెలిసో తెలియకో వర్షాకాలంలో బురద నీటితో కాంటాక్ట్ అవుతుంటాం. ఫలితంగా చేతులు, కాళ్లలో ఫంగస్ ఇన్‌ఫెక్షన్ ప్రధాన సమస్యగా మారుతుంది. ముఖ్యంగా కాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షాకాలంలో మురికినీటితో ఎక్కువగా కాంటాక్ట్ అయ్యేది కాళ్లే. ఫలితంగా మురికి నీటి కారణంగా కాళ్లలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్ తలెత్తుతుంది. కాళ్లకు ఇన్‌ఫెక్షన్ సోకడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు దూరం చేసేందుకు కొన్ని టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో కాళ్లకు ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది పరిశీలిద్దాం..
ఉప్పులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఉప్పు అనేది ఫంగల్ ఇన్‌ఫెక్షన్ దూరం చేయడమే కాకుండా..వర్షాకాలం సంక్రమిత రోగాల్నించి కూడా కాపాడుతుంది. ఓ టబ్ వేడి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి..మీ కాళ్లను 10-15 నిమిషాలు అలా ఉంచాలి. ఇలా చేయడం వల్ల కాలు పూర్తిగా శుభ్రమవడేమే కాకుండా..ఫంగల్ ఇన్‌ఫెక్షన్ దూరమౌతుంది.
కాలి గోరిలో సాధారణంగా మట్టి, వ్యర్ధాలు పేరుకుపోతుంటాయి. ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌కు ఇదే ప్రధాన కారణమౌతుంటుంది అందుకే ఎప్పుడూ కాలిగోర్లను కట్ చేస్తుండాలి. గోర్లు చిన్నగా ఉంటే ఏ విధమైన మట్టి, వ్యర్ధాలు చేరకపోవడమే కాకుండా..ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించుకోవచ్చు. అదే సమయంలో పాదాల్ని అందంగా మార్చుకోవచ్చు.
వర్షాకాలంలో సరైన స్లిప్పర్లు ధరించాలి. మీ పాదాలు, కాలి గోర్లు రెండూ నీళ్లతో తడవకుండా ఉండే స్లిప్పర్లు ధరిస్తే మంచిది.
Also read: Dry Fruits Side Effects: ఆ మూడు సమస్యలున్నవాళ్లు..పొరపాటున కూడా నట్స్ తినకూడదు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook