Health Benefits Of Neem: ఔషధ గుణాలను కలిగిన చెట్లలో వేప ఒకటి. ప్రాచీన కాలం ఆయుర్వేదంలోనూ దీన్ని వినియోగించేవారు. ప్రస్తుతం మోడ్రన్ మెడిసిన్ ఫార్ములాలోనూ వేప కీలకపాత్ర పోషిస్తుంది. వేప ఆకులు, పువ్వులు, విత్తనాలు, పండ్లు, వేర్లు మరియు బెరడు ఇలా చెట్టు ప్రతి ఒక్క భాగం ఏదో ఒక వ్యాధి నివారణ, ఆరోగ్య ప్రయోజనం కోసమో వినియోగిస్తారు.
మరో విశేషం ఏంటంటే వేప (Neem) చెట్టును ‘21 వ శతాబ్దపు చెట్టు’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. వేప ఆకులు, ఉత్పత్తులు తింటే మీ శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఇనుము, కాల్షియం మరియు ఫైబర్ వంటివి సమకూరుతాయి. పరగడుపున వేప ఆకులను తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా వీటిని తీసుకుంటారు. వేప రసం తాగితే ఇన్‌ఫెక్షన్ల నుంచి మీ శరీరాన్ని రక్షిస్తుంది.
Also Read: Health Tips: ఎక్సర్‌సైజ్ ఎక్కువగా చేస్తున్నారా.. ఈ సమస్యలు తెలుసుకోండి
వేప నుంచి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు (Health Benefits Of Eating Neem Leaves)
- Health Tips వేప ఆకులు యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది. వేప ఆకులు ఫంగస్ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి. అస్పెర్‌గిల్లస్, కాండిడా అల్బికాన్స్ మరియు మైక్రోస్పోరం జిప్సం వంటి శిలీంధ్రాల నుంచి సోకే వ్యాధుల బారిన పడకకుండా ఉండేలా వేపతో చేసిన ఇథనాల్, సజల మరియు ఇథైల్ విశ్రమం ఉపయోగిస్తారు.
- ఉదయాన్నే లేవగానే పరగడుపున వేప ఆకులు తినడం వల్ల క్లెబ్సిఎల్లా, ఇ.కోలి, సాల్మానెల్లా వంటి హానికారిక బ్యాక్టీరియాతో పోరాడేందుకు సరిపడ రోగనిరోధక శక్తి (Immunity Power)ని శరీరానికి అందిస్తుంది.
Also Read: 5 Reasons for Heart Attack: గుండెపోటుకు ప్రధాన కారణాలు ఇవే.. బీ కేర్‌ఫుల్!
- వేప తీసుకుంటే మన రక్తం శుద్ధి అవుతుంది. రక్తంలోని మలినాలను, విష పదార్థాలను తొలగిస్తుంది. ఖాళీ కడుపుతో వేప ఆకులు తినడం వల్ల రక్తంలో, మలినాలు తొలగిపోతాయి. మరియు కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధుల నుంచి వేప సంరక్షిస్తుంది.
- వేప ఆకులతో చర్మ సంరక్షణ కలుగుతుంది. అందుకే కొన్ని రకాల సబ్బులను సైతం వేప ఉత్పత్తులతో తయారుచేస్తున్నారు. తద్వారా చర్మాన్ని హానికారక క్రిముల నుంచి కాపాడటంతో పాటు చర్మానికి కొత్త కాంతి వస్తుంది. సోరియాసిస్, మొటిమలు, తామర లాంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధుల చికిత్సలో అధికంగా వేప లాంటి చేదు ఉత్పత్తులను వినియోగిస్తారు.
Also Read: Health Tips: నారింజ పండు తొక్కే కదా అని పారేయవద్దు.. ఈ లాభాలు తెలుసా!
- డయాబెటిస్ (షుగర్ వ్యాధి) సమస్యతో బాధపడేవారికి వేప ఆకులు తినడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. వేప ఆకులు తింటే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయని మీకు తెలుసా. అందుకే తరచుగా వేప ఆకులు తినడం, లేక వేపతో పళ్లు తోముకున్నా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook