Fat Cutter Detox Drink For Weight Loss, Reduce Belly Fat: బరువు తగ్గడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా సహజంగా తయారు చేసుకున్న ఎఫెక్టివ్ వెయిట్ లాస్ డ్రింక్ తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే మూలకాలు శరీరాన్ని హైడ్రేట్‌గా చేయడమేకాకుండా చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా బెల్లీఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా డిటాక్స్ డ్రింక్ తాగాల్సి ఉంటుంది. ఈ డిటాక్స్ డ్రింక్‌ని 15 రోజులు క్రమం తప్పకుండా తాగితే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ఈ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డిటాక్స్ డ్రింక్ తయారి పద్ధతి:
బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడతున్నవారు ప్రతి రోజు డిటాక్స్ డ్రింక్ తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. కాబట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగాల్సి ఉంటుంది.
Also read: BRS MLA Gampa Govardhan: రైస్ మిల్లు సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
- డిటాక్స్ డ్రింక్ చేయడానికి కావలసిన పదార్థాలు:
- 1 టేబుల్ స్పూన్ చియా విత్తనాలు
- గ్లాసు నీళ్ళు
- కరివేపాకు
- అర టేబుల్ స్పూన్ నిమ్మరసం
ఈ రెసిపీ ఇలా తయారు చేయండి:
- డిటాక్స్ డ్రింక్ చేయడానికి ముందుగా.. ఒక కప్పు చియా గింజలను 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టండి.
- ఒక వైపు ఒక బౌల్ తీసుకుని అందులో కప్పు నీటిని వేసుకుని తగినన్ని కరివేపాలు వేసి మరిగించాలి.
- ఇలా మరిగించిన తర్వాత ఆ బౌల్‌ను పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే చయా గింజలను వేసుకోవాలి.
- ఈ బౌల్‌ను వేడి తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని ఆ డ్రింక్ చల్లబడే దాకా అలాగే ఉంచాల్సి ఉంటుంది.
- ఈ డ్రింక్‌ను తీసుకుని ప్రతి రోజు ఖాళీ కడుపుతో తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
చియా గింజల ప్రయోజనాలు:
చియా గింజల్లో ఫైబర్ అధికంగా లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు వీటిని ఆహారాల్లో వినియోగిస్తే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఐరన్ తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. చియా గింజల్లో ఒమేగా-3 కంటెంట్ కూడా లభిస్తుంది. దీంతో వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకుంటే సులభంగా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడచ్చు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: BRS MLA Gampa Govardhan: రైస్ మిల్లు సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook