Bananas for healthy heart: అరటి పండ్లు మనకు అన్ని సీజన్లో అందుబాటులో ఉంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎక్కువగా ఇష్టపడి తీసుకుంటారు. అరటిపండ్లలో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు బరువు తగ్గడానికి జీర్ణక్రియకు గుండె ఆరోగ్యానికి కూడా మంచివి. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. అరటిపండులో నీటి శాతం కార్బోహైడ్రేట్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అయితే ఏదైనా అధిక తినకూడదు అరటి పండులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని మన డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అది ఎలాగో తెలుసుకుందాం..
పోషకాలు పుష్కలం..
అరటి పండులో విటమిన్స్, ఖనిజాలు, పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ b6 పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థకు ఎంతో మంచిది. మెటాబాలిజం రేటును పెంచి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
ఎనర్జీ బూస్ట్..
అరటిపళ్లలో నాచురల్ సహజసిద్ధమైన చక్కరలు ఉంటాయి. గ్లూకోస్, ప్రక్టోస్ ఉంటుంది. ఇది ఎనర్జీకి బూస్ట్ చేస్తుంది అరటిపళ్లను మంచి స్నాక్ రూపంలో తీసుకోవడం వల్ల రోజంతటికి కావలసిన శక్తి అందిస్తుంది.
ఇదీ చదవండి:హోటల్ స్టైల్ లో గుంతపొంగనాలు ఇలా సింపుల్‌గా తయారు చేసుకోండి..
జీర్ణ ఆరోగ్యం..
అరటిపండ్లలో మంచి ఫైబర్ ఉంటుంది. ఇందులో పెక్టిన్ ఉండటం వల్ల జీర్ణక్రియకు మెరుగు పడుతుంది. పేగు కదలికే తోడ్పడి బలబద్ధకం సమస్య రాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీర్ఘకాలం పాటు మలబద్ధకం సమస్య ఉన్నవారు కూడా అరటిపండును తరచూ డైట్లో చేర్చుకోవాలి. అంతేకాదు ఇది పిల్లల డైట్లో కూడా తప్పకుండా చేర్చాలి.
గుండె ఆరోగ్యం..
అరటి పండ్లు పొటాషియం ఉండటం వల్ల ఇది బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ని అని నిర్వహిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. పొటాషియం సోడియంకి వ్యతిరేకంగా పనిచేస్తుంది దీంతో బ్లడ్ ప్రెషర్ లెవెల్ హఠాత్తుగా పెరగకుండా ఉండే మీ గుండె పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉంటుంది.
ఇదీ చదవండి: సెలూన్ వంటి మెరిసే గ్లాసీ జుట్టుకు సింపుల్ చిట్కా.. ఇలా చేసి చూడండి..
మూడు స్వింగ్..
అరటిపండు మీ డైట్లో చేర్చుకోవడం వల్ల ఇందులో అమైనో యాసిడ్ అనే ట్రైప్టోఫ్యాన్ ఉంటుంది ఇది సెరోటినైన్ ఉత్పత్తికి న్యూరో ట్రాన్స్మిటర్ నిర్వహణకు సహాయపడుతుంది. తరచూ మీ డైట్ లో అరటిపండు చేర్చుకోవడం వల్ల సెరోటినైన్ ఉత్పత్తికి ప్రోత్సహిస్తుంది. డిప్రెషన్, యాంగ్జైటీ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి