Covaxin Vaccine: కోవాగ్జిన్‌ను గుర్తించిన ఆస్ట్రేలియా, డబ్ల్యూహెచ్‌వో నిర్ణయం రేపు

Covaxin Vaccine: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు గుడ్‌న్యూస్. ఆస్ట్రేలియా అధికారికంగా కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను గుర్తించింది. మరోవైపు చైనాకు చెందిన మరో వ్యాక్సిన్‌ను కూడా గుర్తిస్తున్నట్టు వెల్లడించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 2, 2021, 08:58 AM IST
  • కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను అధికారికంగా గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం
  • కోవాగ్జిన్ తో పాటు చైనా కంపెనీ సైనోఫార్మ్ అభివృద్ధి చేసిన BBIBP-CorV కు గుర్తింపు
  • కోవాగ్జిన్ అంతర్జాతీయ గుర్తింపుపై డబ్ల్యూహెచ్ వో నిర్ణయం రేపు
Covaxin Vaccine: కోవాగ్జిన్‌ను గుర్తించిన ఆస్ట్రేలియా, డబ్ల్యూహెచ్‌వో నిర్ణయం రేపు

Covaxin Vaccine: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు గుడ్‌న్యూస్. ఆస్ట్రేలియా అధికారికంగా కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను గుర్తించింది. మరోవైపు చైనాకు చెందిన మరో వ్యాక్సిన్‌ను కూడా గుర్తిస్తున్నట్టు వెల్లడించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.

ఇండియాకు చెందిన భారత్ బయోటెక్(Bharat Biotech)కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సినేషన్(Covaxin vaccination) కార్యక్రమంలో ఉన్నా విదేశీ ప్రయాణాలకు వీలుగా అంతర్జాతీయ అనుమతి లేకపోవడం అందరికీ తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్ధ కోవాగ్జిన్‌ను ఇంకా గుర్తించలేదు. ఆ ప్రక్రియ ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. ఈ తరుణంలో ఆస్ట్రేలియా గుడ్‌న్యూస్ అందించింది. మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం (Australia government)అధికారికంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించింది. కోవాగ్జిన్‌తో పాటు చైనాకు చెందిన సైనోఫార్మ్ కంపెనీ అభివృద్ధి చేసిన BBIBP-CorVని కూడా గుర్తించింది. 

కోవాగ్జిన్(Covaxin) తీసుకున్న 12 ఏళ్లు పైబడిన విదేశీ ప్రయాణీకులు, BBIBP-CorV తీసుకున్న 18-60 ఏళ్ల విదేశీ ప్రయాణీకులకు ఈ గుర్తింపు వర్తిస్తుందని ఆస్ట్రేలియాకు చెందిన థెరపెటిక్స్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్TGA)వెల్లడించింది. కోవిడ్ నేపధ్యంలో సరిహద్దుల్ని మూసివేసిన ఆస్ట్రేలియా దాదాపు 20 నెలల అనంతరం మొదటిసారిగా ప్రయాణీకుల్ని అనుమతించింది. ఈ రెండు వ్యాక్సిన్లు కోవిడ్ వైరస్ నుంచి రక్షణ కల్పించడం, ఇతరులకు వ్యాధి సంక్రమింపజేసే అవకాశాల్ని తగ్గించడంలో సహాయపడుతున్నాయని ఆస్ట్రేలియాకు చెందిన థెరపెటిక్స్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా గుర్తించింది. ఈ రెండు వ్యాక్సిన్లను గుర్తించడం వల్ల భారత్, చైనా దేశాల నుంచి లేదా కోవాగ్జిన్ తీసుకున్న ఇతర దేశాల ప్రజలు ఆస్ట్రేలియాలో ప్రవేశించేందుకు అధికారిక ఆమోదం లభించినట్టే. కచ్చితంగా ఈ అంశం అంతర్జాతీయంగా విద్యార్ధులకు లేదా స్కిల్డ్, అన్‌స్కిల్డ్ వర్కర్లకు ఉపయోగపడనుంది. మరోవైపు నవంబర్ 3న జరగనున్న సమావేశంలో కోవాగ్జిన్ అనుమతి విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మరోసారి పరిశీలించనుంది. 

Also read: Zycov D Vaccine: ఇండియాలో మరో వ్యాక్సిన్, ధర తగ్గించిన జైడస్ క్యాడిలా సంస్థ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News