Benefits Of Anjeer: మనం ఎక్కువగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ ఒకటి.. ఇందులో శరీరానికి కావలసిన బోలెడు పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా అంజీర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు వీటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలిగిస్తాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అంజీర్‌ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే వీటిని పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల రెట్టింపు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అంజీర్‌ను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కలిగే లాభాలు..
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
అంజీర్‌లో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఈ వీటిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ కారణంగా రోగనిరోధక శక్తి సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజు అంజీర్ ను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం:
తరచుగా అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం చాలామందిలో మలబద్దకంతో పాటు గ్యాస్ వంటి సమస్యలు వస్తున్నాయి. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఉదయం పూట ఖాళీ కడుపుతో అంజీర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ పరిమాణాలు సులభంగా అన్ని పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్లోకి సీఎన్జీ బైక్‌లు..!
గుండె ఆరోగ్యంగా ఉంటుంది:
అంజీర్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతిరోజు పాలలో నానబెట్టి కాళీ కడుపుతో తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తీవ్ర గుండె సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా అంజీర్ ను ఉదయం పూట తీసుకోవాల్సి ఉంటుంది.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
అంజీర్ లో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. తరచుగా రక్తం లోని చక్కెర పరిమాణాలు పెరిగితే తప్పకుండా అంజీర్ పండ్లను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాల్సి ఉంటుంది.
స్పెర్మ్ కౌంట్‌ను పెంచుతుంది:
ప్రస్తుతం చాలామంది యువత స్పెర్మ్ కౌంట్ సమస్యలతో బాధపడుతున్నారు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా అంజీర్ ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషక గుణాలు స్పెర్మ్ కౌంట్ పెంచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచేందుకు ప్రభావంతంగా తోడ్పడతాయి.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్లోకి సీఎన్జీ బైక్‌లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook