Health Benefits of Ajwain Powder: ఈ రాత్రిళ్లు నిద్ర పట్టట్లేదా..? నీళ్లు తాగితే వారంలో మీ సమస్య తీరిపోతుంది!

Ajwain Powder: నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా..రోజూ రాత్రి సమయంలో గోరువెచ్చని నీళ్లలో అది కలుపుకుని తాగితే అద్భుతమైన ఫలితముంటుంది. హాయిగా నిద్రపడుతుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 17, 2022, 06:32 PM IST
Health Benefits of Ajwain Powder: ఈ రాత్రిళ్లు నిద్ర పట్టట్లేదా..? నీళ్లు తాగితే వారంలో మీ సమస్య తీరిపోతుంది!

Ajwain Health Benefits: కొంతమందికి రాత్రి వేళ సరిగ్గా నిద్రపట్టదు. అటూ ఇటూ దొర్లుతుంటారు కానీ నిద్రలేమి సమస్య బాధిస్తుంటుంది. ఈ పరిస్థితుల్లో ఓ అద్భుతమైన చిట్కాతో ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

చలికాలంలో వాము తినడం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. చలికాలంలో ప్రధానంగా కన్పించే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల్నించి విముక్తి పొందవచ్చు. వాము వేసవి కంటే చలికాలంలో తీసుకోవడమే అత్యుత్తమం. ఎందుకంటే వాము వేడిచేస్తుంది. అందుకే చలికాలంలో తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమౌతాయి. అయితే నిర్ణీత మోతాదు దాటకూడదు. వాము నీటితో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..

గోరువెచ్చని నీళ్లలో వాము పౌడర్ ప్రయోజనాలు

కడుపు సమస్యల్నించి ఉపశమనం

రోజూ రాత్రివేళ గోరువెచ్చని నీటిలో వాము పౌడర్ కలుపుకుని తాగితే కడుపుకు సంబంధించిన సమస్యలు దూరమౌతాయి. గ్యాస్, అజీర్తి సమస్యలు తొలగిపోతాయి. రోజూ వాము పౌడర్ కలుపుకుని తాగుతుంటే..కడుపు సంబంధిత సమస్యలన్నీ దూరమౌతాయి.

ఆకలి

చాలామందికి ఆకలేయకపోవడం అనేది ఓ ప్రధాన సమస్య. ఈ సమస్యకు వాము మంచి ప్రత్యామ్నాయం. నీళ్లలో వామ పౌడర్ కలుపుకుని తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. రోజూ రాత్రి వేళ తాగడం వల్ల ఆకలి కూడా పెరుగుతుంది.

ఇటీవలి కాలంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఎందుకంటే చాలామంది ఒత్తిడి, ఆందోళనలతో ఇబ్బంది పడుతుంటారు. ఫలితంగా నిద్ర సమస్య ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో రాత్రి సమయంలో నిద్ర సరిగ్గా పట్టదు. గోరువెచ్చని నీళ్లలో వాము పౌడర్ కలుపుకుని తాగడం వల్ల మస్తిష్కం ప్రశాంతమై..రాత్రంతా మంచి నిద్రపడుతుంది.

వాము పౌడర్ చేసుకుని నిల్వ ఉంచుకోవాలి. ప్రతిరోజూ రాత్రి సమయంలో ఓ గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో వాము పౌడర్ ఒక స్పూన్ కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

Also read: Turnip Benefits: ముల్లంగి రోజూ తింటే..అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు, ఆ సమస్య కూడా మటుమాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News