Kidney Damage: మీరు చేసే ఈ 5 తప్పులే కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి ప్రధాన కారణం..

5 Mistakes For Kidney Damage: డయాబెటిస్, హైపర్ టెన్షన్ అందరిలో సాధారణం. అయితే చాలామంది వీటిని నిర్వహించరు. ఇవి కిడ్నీ, రక్త నాళాలను పాడు చేస్తాయి రెగ్యులర్గా డయాబెటిస్ నిర్వహిస్తే దానికి అనుసరించి లైఫ్ స్టైల్ మార్పులు చేస్తే కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి.

Written by - Renuka Godugu | Last Updated : Aug 15, 2024, 07:07 AM IST
Kidney Damage: మీరు చేసే ఈ 5 తప్పులే కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి ప్రధాన కారణం..

5 Mistakes For Kidney Damage: కిడ్నీలో ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మనం చేసే కొన్ని తప్పుల వల్ల కిడ్నీలు పాడే అవకాశం పుష్కలంగా ఉంది. ముఖ్యంగా లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవాలి.. మన డైట్ లో సోడియం, ఆల్కహాల్ తక్కువగా ఉండాలి చూసుకోవాలి. కిడ్నీలో ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయి. అంతేకాదు స్మోకింగ్ వంటి వాటిని దూరంగా ఉండాలి. ఇది క్యాన్సర్ డెవలప్ అభివృద్ధి చేస్తుంది. పండ్లు, కూరగాయలు వంటి సమతుల ఆహారం తీసుకుంటే కిడ్నీలో ఆరోగ్యంగా ఉండవచ్చు.
మన లైఫ్ స్టైల్ కూడా ఆరోగ్యంగా ఉంటే కిడ్నీలో పనితీరు మెరుగుపై బలంగా మారతాయి. క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడవచ్చు కిడ్నీలు పాడవడానికి కారణమయ్యే పనులు ఏంటో తెలుసుకుందాం.

డయాబెటిస్, హైపర్ టెన్షన్..
డయాబెటిస్, హైపర్ టెన్షన్ అందరిలో సాధారణం. అయితే చాలామంది వీటిని నిర్వహించరు. ఇవి కిడ్నీ, రక్త నాళాలను పాడు చేస్తాయి రెగ్యులర్గా డయాబెటిస్ నిర్వహిస్తే దానికి అనుసరించి లైఫ్ స్టైల్ మార్పులు చేస్తే కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి.

ఫిజికల్ యాక్టివిటీ, ఒబేసిటీ..
లైఫ్ స్టైల్ మార్పులు చేయకపోవడం వల్ల ఒబేసిటీకి దారితీస్తుంది. ఇది కిడ్నీ వ్యాధులకు కారణమవుతుంది. అతిగా బరువు  పెరగడం హైపర్ టెన్షన్ కి టైప్ 2 డయాబెటిస్ ను అభివృద్ధి చేస్తుంది. దీంతో ప్రాణంతక కిడ్నీ వ్యాధులు వస్తాయి. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి దీంతో బరువు పెరగకుండా ఉంటారు. బిపి తక్కువగా ఉంటుంది ఇన్సూలిన్ నిరోధకత పెరుగుతుంది. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

సోడియం..
అతిగా ఉప్పు తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. దీంతో కిడ్నీలో భారం పడుతుంది ఉప్పు తక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించాలి సోడియం అధికంగా ఉండే ఆహారాలు కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి. అంతేకాదు ప్రాసెస్ చేసిన ఆహారాలు ఉప్పు ఎక్కువగా ఉంటుంది వీటికి దూరంగా ఉండాలి.

ఇదీ చదవండి: విటమిన్ బి 12 లోపం ఉందా? ఈ పవర్ ఫుల్ డ్రింక్ దాన్ని భర్తీ చేస్తుంది..

పెయిన్ కిల్లర్స్..
ఓవర్ ది కౌంటర్ (OTC)తీసుకునే పెయిన్ కిల్లర్స్ కూడా కిడ్నీ వ్యాధులకు దారితీస్తుంది. ముఖ్యంగా బ్రూఫిన్‌, యాస్పిరిన్‌ వంటివి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలు పాడవుతాయి. కేవలం వైద్యులను సంప్రదించి మాత్రమే వాడాcలి.

ప్రోటీన్ డైట్..
అవును అతిగా ప్రోటీన్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలపై భారం పడుతుంది. ఇది తిరిగి కిడ్నీలు పాడవ్వడానికి కారణం అవుతుంది.

స్మోకింగ్..
స్మోకింగ్ పాడవడానికి ప్రధాన కారణం ఇది రక్త సరఫరాను తగ్గిస్తుంది. దీంతో కిడ్నీలో పని తీరు కుంటు పడేలా చేస్తుంది. అంతేకాదు టైప్ 2 డయాబెటీస్‌ కారణం అవుతుంది. కిడ్నీలు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే స్మోకింగ్ కి దూరంగా ఉండాలి.

ఇదీ చదవండి: కడుపులో గ్యాస్ ఇబ్బంది పెడుతోందా? బామ్మల కాలం నాటి అద్భుత చిట్కా..

నీరు..
డిహైడ్రేషన్ కి గురికాకుండా ఉండడానికి కూడా ముఖ్యం. కిడ్నీలు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా తీసుకోవాలి తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు కూడా పేరుకుంటాయి. ప్రతిరోజు 10 గ్లాసు నీటిని తీసుకోవాలి దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News