రామ్‌గోపాల్‌వర్మ మియా మాల్కోవా అనే హాలీవుడ్ పోర్న్ స్టార్ పై తీస్తున్న "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" అనే ఆన్లైన్ చిత్రం విషయంలో కొంత పాజిటివ్ భావనతో ఉన్నారన్న విషయంలో ప్రముఖ చిత్ర విమర్శకుడు కత్తి మహేష్ పై ఓ టీవీ ఇంటర్వ్యూలో మాటల దాడి చేశారు పలువురు మహిళా సామాజికవేత్తలు. కత్తి మహేష్, రామ్‌గోపాల్‌వర్మతో కలిసి ఓ ఇంటర్వ్యూలో కూర్చుని ఆ చిత్రంపై కొంత సమర్థనీయంగా మాట్లాడడంపై వారు అభ్యంతరం తెలిపారు. అయితే తన మాటలను మరోలా అర్థం చేసుకోవద్దని.. తను గతంలో కూడా ఆర్జీవి చిత్రాలను విమర్శించిన దాఖలాలు ఉన్నాయని.. ఈ చిత్రం కూడా చూస్తే తప్పించి ఏమీ మాట్లాడలేమని ఆయన అన్నారు.
ఒకవేళ అదిపూర్తి స్థాయిలో మహిళలను కించపరిచేలా ఉంటే తాను సైతం దానిని సమర్థించనని ఆయన చెప్పారు. బాడీ షేమింగ్ గురించి గతంలో వ్యతిరేకించిన కత్తి మహేష్.. ఈ సమయంలో మహిళల మనోభావాలు దెబ్బతీనేలా ప్రవర్తిస్తున్నారని కూడా పలువురు మహిళా సామాజికవేత్తలు తెలిపారు. లైంగిక స్వేచ్ఛ గురించి పురుషులు మాట్లాడక్కర్లేదని వారు తెలిపారు. ఆర్జీవి ఈ చిత్రం పేరుతో లైంగిక దోపిడి చేస్తే తాము సమర్థించమని వారు పేర్కొన్నారు. దీనికి కత్తి మహేష్ స్పందిస్తూ.. ఆ చిత్రాన్ని చూస్తే తప్పించి ఏం మాట్లాడలేమని.. ఆర్జీవి సైతం హద్దులు మీరి ప్రవర్తిస్తే దానిని అందరూ ఖండించాల్సి ఉందని.. ఆయన మాట్లాడిన ప్రతీ మాటకి తాను అవునని చెప్పలేదని.. తనకు కూడా ఆ విషయంలో పలు అభ్యంతరాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.