mAadhaar App: ఆధార్‌కార్డు ఉంటే..వెంటనే ఈ యాప్ డౌన్‌లోడ్ చేస్తే చాలు..అన్ని పనులు దీనితోనే ఇక

mAadhaar App: ఆధార్‌కార్డు ప్రతి పనికీ ఆధారంగా మారింది. అందుకే ఐడీ ప్రూఫ్‌గా పనిచేస్తోంది. ఆధార్ ఎంత కీలకమైందంటే..అన్ని రకాల సేవల్ని అందుకునేందుకు ఇదే కీలకంగా ఉంది. ఆ వివరాలు  మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 21, 2022, 08:43 PM IST
mAadhaar App: ఆధార్‌కార్డు ఉంటే..వెంటనే ఈ యాప్ డౌన్‌లోడ్ చేస్తే చాలు..అన్ని పనులు దీనితోనే ఇక

ఇండియాలో ఆధార్‌కార్డు ఒక కీలకమైన డాక్యుమెంట్. ఆధార్‌కార్డు ద్వారా ఇటు గుర్తింపు అటు వివిధ పథకాల లబ్ది చేకూరుతుంది. అందుకే ఆధార్‌కార్డు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలి. ఆధార్‌కార్డు అప్‌డేట్స్ కోసం ఆ యాప్ కీలకంగా ఉపయోగపడనుంది.

ఆధార్‌కార్డు అత్యంత కీలకమైన డాక్యుమెంట్. ప్రతి పనికీ అత్యవసరం. వివిధ రకాల సేవలు పొందాలంటే ఆధార్‌కార్డు చాలా అవసరం. ఇంత విలువైన ఆధార్‌కార్డు పొరపాటు పోతే చాలా ఇబ్బందులు ఎదురౌతాయి. డూప్లికేట్ తీసుకోవచ్చు గానీ..పోగొట్టుకున్న ఆధార్‌కార్డు దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకే యూఐడీఏఐ  mAadhaar యాప్ లాంచ్ చేసింది. ఫిజికల్ ఆధార్‌కార్డు ఎలా పనిచేస్తుందో ఇది అలానే పనిచేస్తుంది. దీని వల్ల ఆధార్‌కార్డు పోగొట్టుకునే పరిస్థితి లేదా దుర్వినియోగమయ్యే అవకాశముండదు.

mAadhaar

mAadhaar యాప్‌ను యూఐడీఏఐ లాంచ్ చేసింది. ఇది అధికారికమైన ఆధార్‌యాప్. ఆధార్‌కార్డు హోల్డర్లకు వారి వారి స్మార్ట్‌ఫోన్లలో డేటా, ఫోటోలు తీసుకునేందుకు అనుమతిస్తుంది. ఆధార్‌కార్డు హోల్డర్లు తమ ప్రొఫైల్‌ను యాప్‌లో చేర్చవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ యాప్ మీకు 5 ఆధార్ ప్రొపైల్స్ వరకూ అనుమతిస్తుంది. ఈ యాప్ పాస్‌వర్డ్ ద్వారా సురక్షితంగా ఉంటుంది. యాప్ వినియోగించే ప్రతిసారీ పాస్‌వర్డ్ తప్పనిసరి.

mAadhaar ప్రత్యేకతలు

ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పోగొట్టుకున్న ఆధార్‌కార్డు తిరిగి పొందవచ్చు. ఆధార్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా చూడవచ్చు. పేపర్‌లెస్ ఈకేవైసీ లేదా క్యూఆర్ కోడ్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఆధార్ లేదా బయోమెట్రిక్స్ లాక్ చేయడం ద్వారా ఆధార్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఆధార్ ఎస్ఎంఎస్ సేవల్ని ఆఫ్‌లైన్‌లో కూడా పొందవచ్చు. ఆధార్ అప్‌డేట్ స్టేటస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ లేనివారు ఆధార్ సేవల్ని పొందేందుకు  ఈ యాప్ ఉపయోగపడుతుంది.

Also read: HDFC Bank Story: హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంకు ఎలా ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News