హాలీవుడ్ చిత్రానికి సైన్ చేయనున్న బాలీవుడ్ హీరో..?

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ దర్శకుడు లారెన్స్ కసనాఫ్ త్వరలో ఓ భారీ యాక్షన్ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారని.. ఆ సినిమాలో టైగర్ ష్రాఫ్‌ని కూడా నటించమని అడిగారని సమాచారం

Last Updated : Sep 21, 2018, 12:52 PM IST
హాలీవుడ్ చిత్రానికి సైన్ చేయనున్న బాలీవుడ్ హీరో..?

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ దర్శకుడు లారెన్స్ కసనాఫ్ త్వరలో ఓ భారీ యాక్షన్ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారని.. ఆ సినిమాలో టైగర్ ష్రాఫ్‌ని కూడా నటించమని అడిగారని సమాచారం. ఇటీవలే ఇదే విషయం గురించి మాట్లాడడానికి లారెన్స్, రైటర్ సీన్ కేథరిన్ డెరిక్‌తో కలిసి ముంబయికి వచ్చారని కూడా వార్తలు వస్తున్నాయి. టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో తారా సుతారియా, అనన్య పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అలాగే రాంబో సిరిస్ బాలీవుడ్ రీమేక్‌లో కూడా టైగర్ నటిస్తున్నారని వినికిడి. తాజాగా టైగర్‌కి హాలీవుడ్ ఆఫర్ రావడానికి కారణం గుల్షన్ గ్రోవర్ తనయుడు సంజయ్ గ్రోవర్ అని కూడా వార్తలు వస్తున్నాయి. మంచి యాక్షన్ హీరో కావాలని హాలీవుడ్ ప్రముఖులు సంజయ్‌ని సంప్రదించినప్పుడు ఆయన టైగర్ పేరును ప్రస్తావించాడని కూడా పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టైగర్ సైన్ చేయబోయే చిత్రంలో జాకీచాన్ లేదా బ్రూస్లీ కూతురు షానన్ లీ నటించే అవకాశముంది అంటున్నారు. 

ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడైన టైగర్ ష్రాఫ్ నటించిన తొలి చిత్రం "హీరోపంటీ" 2014లో విడుదలైంది. తెలుగు చిత్రం "పరుగు"కి ఈ చిత్రం రీమేక్. ఇదే చిత్రం తర్వాత బాగీ, ఏ ఫ్లైయింట్ జాట్, మున్నా మైఖైల్, బాగీ 2 చిత్రాల్లో టైగర్ నటించారు. గతంలో బెంగుళూరు టైగర్స్ జట్టుకి టైగర్ కో ఓనర్‌గా వ్యవహరించారు. 

Trending News