'సైరా' అంటున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?

చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం'సైరా'. ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 6వ తేదీన సెట్స్ పైకి వెళ్ళింది. 

Last Updated : Jan 28, 2018, 08:40 PM IST
'సైరా' అంటున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?

చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం 'సైరా'. ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 6వ తేదీన సెట్స్ పైకి వెళ్ళింది. మెగాస్టార్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రమిది. ఈ చిత్రం తన తొలి షెడ్యుల్ ను హైదరాబాద్ లోని కొండాపూర్ అల్యూమినియం ఫ్యాక్టరీలో పూర్తిచేసుకొని.. ఫిబ్రవరిలో రెండో షెడ్యుల్ కి సిద్దమైంది. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున ఈ బయోపిక్ చిత్రాన్ని ప్రముఖ సినీనటుడు రాంచరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 200కోట్లు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి నటిస్తున్నారు. షెడ్యుల్ లో భాగంగా త్వరలో ఈ చిత్రం రాజస్థాన్, పొల్లాచి తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనుంది. 

ఇక వివరాల్లోకి వెళితే.. పై ఫోటోలో కనిపిస్తున్న బుడతడి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. చాలామంది ఈ ముద్దులొలికే బుడతడి గురించి తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయినా ఎవరూ కనిపెట్టలేకపోయారు. చివరికి చిత్ర యూనిట్ చెప్పడంతో అవునా..!! అని ఆశ్చర్యపోయారట. ఇంతకీ ఈ బుడతడెవరో చెప్పలేదు కదూ..! దర్శకుడు సురేందర్ రెడ్డి ముద్దుల కొడుకు. ఈ బుడ్డోడు చిరు కాస్ట్యూమ్ కి ఫిదా అయి అలాంటి డ్రెస్సే కావాలని మారాం చేయడంతో .. స్పెషల్ గా చేయించినట్లు తెలుస్తోంది. సైరా కాస్ట్యూమ్ తో ఉన్న ఈ  చిన్నారి ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

Trending News