Vijay Devarakonda Arrogant Behaviour: విజయ్ దేవరకొండ బలుపు వెనకున్న అసలు కధ ఇదే!

Real Story Behind Vijay Devarakonda Arrogant Behaviour in Liger Hyderabad Pressmeet:  హైదరాబాద్ ప్రెస్ మీట్లో విజయ్ దేవరకొండ మీడియా ప్రతినిధుల ముందు బెంచ్ మీద కాళ్లు వేసుకుని కూర్చోవడం చర్చనీయాంశం అయింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2022, 01:04 PM IST
Vijay Devarakonda Arrogant Behaviour: విజయ్ దేవరకొండ బలుపు వెనకున్న అసలు కధ ఇదే!

Real Story Behind Vijay Devarakonda Arrogant Behaviour in Liger Hyderabad Pressmeet: పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తన హీరోయిన్ అనన్య పాండే డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి దేశమంతా పర్యటనలు చేస్తున్నారు. అయితే ఇటీవల హైదరాబాద్ వచ్చిన విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఇద్దరూ కలిసి ఒక ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఆగస్టు 15న జరిగిన ఈ ప్రెస్ మీట్ గురించి తెలుగు సినీ మీడియా జర్నలిస్టులకు పూర్తి అవగాహన ఉంది.

కాబట్టి ఈ ప్రెస్ మీట్లో జరిగిన ఒక చిన్న విషయం అప్పట్లో పెద్ద వివాదం ఏమీ కాలేదు. కానీ తర్వాత సోషల్ మీడియాలో ఈ విషయం మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. విజయ్ దేవరకొండకి కొన్ని హిట్లు రాగానే ఒక పాన్ ఇండియా హీరో కాగానే ఇంత బలుపు వచ్చేసిందా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక ఓ నాలుగు సినిమాల్లో నటించగానే... మరీ ఇంత అహంకారమా...? ప్రెస్‌మీట్లో ఎదురుగా కూర్చున్న జర్నలిస్టులూ కూడా మనుషులేగా...?? అంటూ చాలా మంది విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి వంటి. వందల సినిమాల్లో నటించిన ఎంతో మంది పేరెన్నికగన్న మహానటులు కూడా బహిరంగంగా ఎప్పుడూ ఇలా ప్రవర్తించిన దాఖలాలు లేవని అసలు ఆరోజు ఏం జరిగిందో తెలియని వారు కామెంట్ చేస్తున్నారు. అయినా వాడిని కాదు... అలా సభ్యత, సంస్కారం లేకుండా ప్రవర్తించిన ఆ ప్రెస్‌మీట్ ను బాయ్‌కాట్ చేయకుండా... కవరేజ్ ఇచ్చిన మా పాత్రికేయ సోదరులను అనాలి అంటూ కూడా వారు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న క్రమంలో ఇది కొత్త వివాదానికి దారి తీసింది. ఈ నేపద్యంలో అసలు ఆరోజు ప్రెస్ మీట్ లో ఏం జరిగింది? ఎందుకు విజయ్ దేవరకొండ అలా బెంచ్ మీద కాళ్లు పెట్టి ఎలా మాట్లాడాడు అనే విషయం మీద ఇప్పుడు తెలుగు సినీ మీడియా ప్రతినిధులు ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 
 
అసలు ఆ రోజు ఏం జరిగిందంటే?
విజయ్ దేవరకొండ ఎప్పటి లాగానే పాత్రికేయలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. అయితే ఒక తెలుగు సినీ మీడియా ప్రతినిధి టాక్సీవాలా సినిమా ప్రమోషన్స్ టైంలో మీతో చాలా సరదాగా మాట్లాడామని అప్పట్లో బాలీవుడ్ కి వెళతారా? అని అడిగితే నవ్వేసి ఊరుకున్నారు కానీ ఇప్పుడు బాలీవుడ్ కాదు ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారి మా ముందుకు వస్తే మీతో మాట్లాడడానికి కాస్త ఇబ్బందిగా ఉందని అన్నారు.

అయితే విజయ్ దేవరకొండ ఆ పాత్రికేయుని ఇన్ సెక్యూరిటీ పోగొట్టి చాలా ఫ్రీగా మాట్లాడమని మీరు కాలు మీద కాలు వేసుకుని అడగండి నేను కూడా కాలు మీద కాలేసుకుని సమాధానం ఇస్తాను అంటూ తన ఎదురుగా ఉన్న బెంచ్ మీద కాలు పెట్టారని, అయితే అది అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులందరికీ క్లారిటీ ఉండడంతో ఆ విషయం మీద పెద్దగా ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తోంది. తర్వాత యూట్యూబ్ లో ఈ వీడియోలో వైరల్ కావడం అవి మీమ్ పేజెస్ వాళ్ళు చూడడంతో ఇది మరో విధంగా ప్రేక్షకుల ముందుకు వెళ్ళింది.

విజయ్ దేవరకొండ అహంకారంతో బలుపుతోనే ఇలా కాళ్లు టేబుల్ మీద పెట్టాడు అంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో అది నిజం కాదంటున్నారు తెలుగు సినీ మీడియా ప్రతినిధులు. విజయ్ దేవరకొండ ఎన్నో రాష్ట్రాలు ఎన్నో సిటీలలో తిరిగినా సరే మన తెలుగు మీడియా ప్రతినిధులను చూడగానే అన్నీ మరచిపోయి మీతో ఫోటో దిగి చాలా కాలమైంది ఒక గ్రూప్ ఫోటో దిగుదామని కూడా అడిగాడని అలా ఆ సమయంలో గ్రూప్ ఫోటో కూడా దిగామని చెప్పుకొచ్చారు.

ఇక అలా ఒక మీడియా ప్రతినిధి షేర్ చేసిన వీడియోను విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేసి ‘’ఎవరైనా తమ రంగంలో ఎదగాలని ప్రయత్నించే వారిని ఎప్పుడూ టార్గెట్ చేస్తూ ఉంటారు. కానీ మేము పోరాడతాము, ఒకవేళ మీరు నిజాయితీగా ఉంటూ మీరు, ప్రతి ఒక్కరి మంచిని కోరుకున్నప్పుడు - ప్రజల ప్రేమ ఎప్పుడూ మీతోనే ఉంటుంది.  దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడని అంటూ రాసుకొచ్చారు. ఇక విజయ్ దేవరకొండ కాళ్లు పెట్టడం కరెక్టే కానీ అందులో ఎలాంటి బలుపు లేదని, ఈ విషయంలో ట్రోల్ చేయవద్దని టాలీవుడ్ మీడియా ప్రతినిధులు కోరుతున్నారు.
Also Read: Boycott Tension to Liger: వారంలో విడుదలనగా లైగర్ టీంకి కొత్త టెన్షన్.. !

Also Read: iBOMMA Shock to Indian Users: యూజర్లకు షాకిచ్చిన ఐబొమ్మ.. ఏమైందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News