Rajamouli Correct jr NTR : అదొక్కటే తప్పుగా మాట్లాడావ్ తారక్.. రాజమౌళి ట్వీట్ వైరల్

Rajamouli Oscar Award రాజమౌళికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ అవార్డు ఇచ్చిందంటే.. దాదాపుగా ఆస్కార్ అవార్డు కూడా కన్ఫామ్ అయినట్టే.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2022, 04:16 PM IST
  • న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌ నుంచి బెస్ట్ డైరెక్టర్
  • దర్శకధీరుడికి రాజమౌళికి అరుదైన గుర్తింపు
  • రాజమౌళికి ఆస్కార్ రానుండటంపై ఎన్టీఆర్ ట్వీట్
Rajamouli Correct jr NTR : అదొక్కటే తప్పుగా మాట్లాడావ్ తారక్.. రాజమౌళి ట్వీట్ వైరల్

jr NTR Tweet on Rajamouli New york Film Critics Circle Award : రాజమౌళికి అవార్డ్ రావడం పక్కా అన్న విషయం మరోసారి రుజువైంది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఎంచుకున్న వారికే దాదాపు ఆస్కార్ అవార్డు వస్తూ ఉంటుందట. ఆ సంస్థ ఈ ఏడాది రాజమౌళిని బెస్ట్ డైరెక్టర్‌గా ఎంచుకుంది. దీంతో ఈ సారి రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ వస్తుందని అంతా ఫిక్స్అయ్యారు. దీంతో జక్కన్నపై తెలుగు సినీ ప్రముఖులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రాజమౌళికి ఆస్కార్ వస్తుందని ఫిక్స్ అయిన సెలెబ్రిటీలు కంగ్రాట్స్ చెబుతున్నారు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఇలా రాజమౌళిని బెస్ట్ డైరెక్టర్‌గా గుర్తించడంతో అడివి శేష్, శోభు యార్లగడ్డ వంటి వారు స్పందించారు. తాజాగా రాజమౌళి మీద ఎన్టీఆర్ కూడా ట్వీట్ వేశాడు. జక్కన్నకు కంగ్రాట్స్.. ఈ నీ జర్నీ కేవలం ఆరంభం మాత్రమే.. ఇంకా ఎంతో ఉంది.. నాకు నీకు గురించి అంతా తెలుసు.. ఇప్పుడు ప్రపంచం తెలుసుకోబోతోంది అని ట్వీట్ వేశాడు.

 

ఎన్టీఆర్ వేసిన ట్వీట్‌లో చిన్న కరెక్షన్ ఉందని రాజమౌళి చెప్పుకొచ్చాడు. అది నా జర్నీ కాదు.. మన జర్నీ.. మన జర్నీకి ఇది ఆరంభం మాత్రమే అని జక్కన్న నవ్వేశాడు. మరి రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ వస్తుందా? లేదా? అన్నది చూడాలి. ఒక వేళ రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ వస్తే.. ఇండియన్ సినీ హిస్టరీకే అది గర్వకారణం అవుతుంది. వందేళ్ల సినిమా చరిత్రలో ఇంత వరకు ఏ దర్శకుడికి కూడా ఆస్కార్ అవార్డు రాలేదు.

అసలే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేశాడు. వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను నెత్తిన పెట్టుకున్నాయి. కొన్ని విమర్శలు వచ్చినా కూడా సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం పదకొండు వందల కోట్లు కలెక్ట్ చేసింది. ఇక జపాన్‌లో ఇప్పటికీ ఈ సినిమా బాగానే ఆడేస్తోంది.

Also Read : Disha Patani Bikini Pics : దిశా పటాని తడి అందాలు.. స్విమ్మింగ్‌ పూల్‌లో బికినీతో లోఫర్ బ్యూటీ సందడి

Also Read : Ram Gopal Varma Dangerous : ఒకేసారి నలుగురితో.. వామ్మో అనేలా ఆర్జీవీ.. అప్పట్లో చేసిన పనులపై వర్మ కామెంట్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News