ఆ రాష్ట్రంలో ఇకపై మద్యం ఇంటివద్దకే..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి నివారణకు పకడ్బందీగా అమలవుతోన్న లాక్‌డౌన్ మూడవ దశలో మద్యం అమ్మకాలకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. అయితే పంజాబ్‌లోని మందుప్రియులు

Last Updated : May 6, 2020, 02:55 PM IST
ఆ రాష్ట్రంలో ఇకపై మద్యం ఇంటివద్దకే..

చండీఘడ్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి నివారణకు పకడ్బందీగా అమలవుతోన్న లాక్‌డౌన్ మూడవ దశలో మద్యం అమ్మకాలకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. అయితే పంజాబ్‌లోని మందుప్రియులు ఇంటివద్దకే లిక్కర్ ను అందుకోగ‌లుగుతారని తెలిపారు. గురువారం నుంచి పంజాబ్ ప్రభుత్వం నేరుగా ఇంటికే మద్యం స‌ర‌ఫ‌రా చేయబోతోంది. 

Also Read: కరోనా వ్యాక్సిన్ రెడీ..!!
 

మరోవైపు రాష్ట్రంలో మద్యం షాపులు కూడా తెర‌వ‌నున్నారని, అయితే షాపింగ్ సమూదాయాలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే తెర‌వ‌నున్నట్లు పేర్కొన్నారు. ఇంకోవైపు ఛత్తీస్‌గ‌ఢ్‌ ప్రభుత్వం మద్యం పంపిణీ డోర్ డెలివ‌రీ కోసం పోర్టల్‌ను ప్రారంభించింది. మద్యం దుకాణాల ద‌గ్గ‌ర‌కు భారీగా మందుబాబులు రావడాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుందని అన్నారు. అయితే మ‌ద్యం డోర్ డెలివ‌రీ సేవ‌లు గ్రీన్ జోన్‌లో ఉన్నవారికి మాత్రమే అందుబాటులోకి రానున్నాయని అన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.

Trending News