నేను రవితేజలా నటించలేను: పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మహారాజా రవితేజ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.

Last Updated : May 11, 2018, 01:27 PM IST
నేను రవితేజలా నటించలేను: పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మహారాజా రవితేజ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. రవితేజ నటించిన "నేల టికెట్" సినిమా ఆడియా రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ తన మదిలోని భావాలను పంచుకున్నారు. "నేను నటుడిని కాకముందు రవితేజ నటించిన చిత్రాలు చూశాను. తొలిసారిగా అన్నయ్య నటించిన హిందీ చిత్రం "ఆజ్ కా గుండా రాజ్" చిత్రం ప్రివ్యూ షోకి వెళ్లినప్పుడు రవితేజను కలిశాను.

ఆ తర్వాత ఒక సినిమా హీరోగా రవితేజ మారడానికి ఎంత కష్టపడ్డాడో.. ఎన్ని బాధలు అనుభవించాడో తెలుసుకున్నాక ఆయనపై నాకు అభిమానం ఎంతో పెరిగింది. కొత్తవాళ్లతో కూడా ఆయన చాలా ఎనర్జిటిక్‌గా పనిచేయడం చూసి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. కానీ నేను రవితేజలా నటించలేను. ఒక రకంగా చెప్పాలంటే రవితేజ నాకు ఆదర్శం" అని రవితేజ పై ప్రశంసల జల్లులు కురిపించాడు పవన్ కళ్యాణ్

కళ్యాణ్ క్రిష్ణ దర్శకత్వం వహిస్తున్న "నేల టికెట్" చిత్రంలో రవితేజకు జతగా మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే జగపతి బాబు ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఎస్సార్టీ బేనర్ పై ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. 24 మే 2018 తేదిన ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు నిర్మాతలు. 

Trending News