నితిన్ 25వ సినిమా 'ఛల్‌ మోహన్‌రంగ' ఫస్ట్ లుక్ రిలీజ్

నితిన్  25వ సినిమా 'ఛల్‌ మోహన్‌రంగ' ఫస్ట్ లుక్ రిలీజ్

Last Updated : Feb 11, 2018, 04:43 PM IST
నితిన్ 25వ సినిమా 'ఛల్‌ మోహన్‌రంగ' ఫస్ట్ లుక్ రిలీజ్

కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ తన 25వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు 'ఛల్‌ మోహన్‌రంగ' అనే టైటిల్ ఫిక్స్ చేసి, సినిమా ఫస్ట్ లుక్ ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ఫేస్  బుక్ పేజీ ద్వారా విడుదల చేశారు. ఈ లుక్ లో నితిన్, మేఘా ఆకాశ్ ఆకాశంలో గంతులేస్తూ.. మరో లుక్ లో కళ్లజోడు పెట్టుకొని నితిన్ విజిలేస్తూ కనిపిస్తాడు. ఈ టైటిల్ వద్ద 'ఎవ్రీథింగ్ ఈజ్ ఏ సైన్' అని పుస్తక రూపంలో మెసేజ్ కనిపిస్తుంది.

శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా, శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రం టీజర్ ను ప్రేమికులరోజు అయిన ఈ నెల 14న, సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు.

 

ఇక షూటింగ్ విషయానికొస్తే.. ఒక్క పాట మినహా సినిమా మొత్తం పూర్తయింది. ఆ మిగిలిన ఒక్క పాటను ఫిబ్రవరి 14 నుంచి హైదరాబాదులో చిత్రీకరించనున్నారు.  హైదరాబాద్, ఊటీ, అమెరికాలో ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ జరిగింది.

Trending News