వీడియో: నాగచైతన్య ‘సవ్యసాచి’ టీజర్ విడుదల

వీడియో: నాగచైతన్య ‘సవ్యసాచి’ టీజర్ విడుదల

Last Updated : Oct 2, 2018, 11:37 AM IST
వీడియో: నాగచైతన్య ‘సవ్యసాచి’ టీజర్ విడుదల

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ సరసన బాలీవుడ్ నటి నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా.. సోమవారం ‘సవ్యసాచి’ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు.

టీజర్‌లో.. ‘ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములు అంటారు. అదే ఒకే రక్తం, ఒకే శరీరం పంచుకుని పుడితే అద్భుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొదలుని, వరుసకి కనిపించని అన్నని, కడదాకా ఉండే కవచాన్ని, ఈ సవ్యసాచిలో సగాన్ని’ అని నాగచైతన్య చెప్పే డైలాగ్‌ హైలెట్.

మాధవన్‌, భూమిక ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా..కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.  న‌వంబ‌ర్ 2న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుందని తెలిసింది.

టీజర్ పై హీరో నాగ చైతన్య, హీరోయిన్ నిధి అగర్వాల్‌, కీరవాణి, రానా దగ్గుబాటి తదితరులు స్పందించారు. 

 

 

 

 

అటు చైతూ, సమంతలు కలిసి జోడీగా ఓ కొత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు మజిలి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Trending News