చైతూ కోసం రంగంలోకి దిగిన బాహుబలి టీమ్

పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో నాగచైతన్య అప్‌కమింగ్ సినిమా సవ్యసాచి 

Last Updated : Jun 17, 2018, 07:53 PM IST
చైతూ కోసం రంగంలోకి దిగిన బాహుబలి టీమ్

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న నాగచైతన్య అప్‌కమింగ్ సినిమా సవ్యసాచికి తుదిమెరుగులు అద్దడం కోసం బాహుబలి సినిమాకు పనిచేసిన పలువురు సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగారు. ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్సెస్‌తో పాటు ఈ సినిమాలో భారీ స్థాయిలో జరుగుతున్న గ్రాఫిక్ వర్క్ కూడా ఈ సినిమాకు మరో ప్లసా పాయింట్ కానుంది. అయితే, ఆ విజువల్ ఎఫెక్ట్స్ ను అద్భుతంగా, సహజంగా మలచడం కోసం బాహుబలి సినిమా కు పనిచేసిన గ్రాఫిక్ టీమ్ సవ్యసాచికి సేవలు అందిస్తోంది. చైతూతోపాటు మరో ప్రధాన పాత్రలో ఆర్ మాధవన్ నటించడం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. భూమికా చావ్లా మరో ముఖ్యపాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ఐటం సాంగ్ చేయనుంది. అంటే ఈ సినిమాకుకావాల్సినన్ని వినోదాత్మక అంశాలున్నాయన్న మాట. 

ఇక చైతూ విషయానికొస్తే, ఓ వైపు మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా షూటింగ్‌కి హాజరవుతూనే... మరోవైపు ఈ సినిమా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసే ప్రాసెస్‌లో ఉన్నాడు చైతూ. ఈ సినిమాలో చైతు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రేమమ్ తర్వాత మరోసారి చైతూ-చందూ కాంబోలో సెట్స్‌పైకి వెళ్లిన సినిమా కావడంతో మరోసారి వీళ్లిద్దరి నుంచి ఓ మాంచి ఎంటర్ టైనర్ వస్తుందని ఆశిస్తున్నారు అక్కినేని అభిమానులు, ఆడియెన్స్. 

Trending News