దీపికా పదుకొనేకు మిస్ వరల్డ్ మద్దతు

Last Updated : Dec 1, 2017, 04:12 PM IST
దీపికా పదుకొనేకు మిస్ వరల్డ్ మద్దతు

పద్మావతి సినిమాతో వివాదంలో చిక్కుకున్న హీరోయిన్ దీపికా పదుకొనేకు బాలీవుడ్ పూర్తి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆమెకు మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్ మద్దతు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మానుషి మాట్లాడుతూ దీపిక ఒక నటి మాత్రమే అనే విషయాన్ని నిరసనకారులు గుర్తుంచుకోవాలన్నారు. ఈ సినిమాపై అభ్యంతరాలు లేవనెత్తుతూ కొందరు ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించడం.. నటులపై దాడులు జ‌రిపితే న‌జ‌రానాలు ఇస్తామ‌ని ప్రకటించడం వంటి చర్యలు సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. దీపిక ప‌దుకొనే న‌టించిన‌ బాలీవుడ్ సినిమా ప‌ద్మావ‌తి వివాదాల్లో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హీరోయిన్‌గా నటిస్తున్న దీపికా పదుకొనేను హతమార్చాలంటూ రాజ్‌పుత్ క‌ర్ణిసేన చేసిన కామెంట్స్ పై మిస్‌ వరల్డ్‌-2017 మానుషి చిల్లర్‌ ఇలా ఘాటుగా స్పందించారు. 

Trending News