ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన చిరంజీవి

మెగాస్టార్..  తెలుగు తెరపై పరిచయం అక్కర లేని పేరు. చిన్న నుంచి పెద్ద వాళ్ల వరకు అంతా చిరు ఫ్యాన్స్ ఉన్నారు. తన అభిమానులకు మరింత దగ్గరవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి మరో నిర్ణయం తీసుకున్నారు.

Last Updated : Mar 25, 2020, 04:25 PM IST
ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన చిరంజీవి

మెగాస్టార్..  తెలుగు తెరపై పరిచయం అక్కర లేని పేరు. చిన్న నుంచి పెద్ద వాళ్ల వరకు అంతా చిరు ఫ్యాన్స్ ఉన్నారు. తన అభిమానులకు మరింత దగ్గరవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి మరో నిర్ణయం తీసుకున్నారు. 

ఉగాది  పర్వదినం.. తెలుగు వారందరికీ శుభదినం. తెలుగు సంవత్సరాది  ప్రారంభమయ్యే ఈ రోజున మంచి పనికి శ్రీకారం చుడతారు తెలుగువారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో చేరారు. అదే  ఇన్‌స్టాగ్రామ్. ఇన్నాళ్లూ ఆడియో ఫంక్షన్లు లేదా సినిమా ఫంక్షన్ల ద్వారా మాత్రమే అభిమానులతో సంభాషించిన చిరు.. ఇప్పుడు సరికొత్తగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా ఫ్యాన్స్‌ను కలుసుకోబోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కుర్ర అభిమానులకు దగ్గరయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. 

ఇవాళే ఇన్‌స్టాగ్రామ్‌లో జాయిన్ అయిన చిరు... తన ఫోటోను పోస్టు చేశారు. ఆయన  జాయిన్ అయిన కొద్దిసేపట్లోనే 4 లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. కేవలం ఒకే ఒక్కపోస్టుకు దాదాపు లక్ష లైకులు వచ్చి పడ్డాయి. దీంతో చిరు స్టామినా ఏంటో అర్ధం  చేసుకోవచ్చు. ఇక  ముందు సినిమాలకు సంబంధించిన విషయాలను ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా  అభిమానులతో పంచుకోనున్నారు. 

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా పేరు  ఖరారు చేయలేదు. ఐతే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇమేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://www.instagram.com/chiranjeevikonidela/?hl=en

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News