ఆగస్టు 21న విడుదల కానున్న 'సైరా' టీజర్

సురేందర్ రెడ్డి-మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'సైరా'.

Last Updated : Aug 15, 2018, 12:21 PM IST
ఆగస్టు 21న విడుదల కానున్న 'సైరా' టీజర్

సురేందర్ రెడ్డి-మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'సైరా'. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో చిరంజీవి లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. సైరా టీజర్.. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజున రిలీజ్ అవుతుందని అభిమానులు ఎదురుచూస్తుండ‌గా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ గురించి కొద్దిసేపటి క్రితమే మూవీ యూనిట్ ఒక ప్రకటన చేసింది.

ఇప్పటికే ఈ సినిమా స్టిల్స్ లీకయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ లుక్ విడుదల చేసినా, మెగా ఫ్యాన్స్ అంతగా సంతృప్తి చెందరని భావించిన సినిమా నిర్మాత చరణ్, ఏకంగా టీజర్‌నే విడుదల చేయాలనుకుంటున్నాడట. ఈ సినిమా దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో కొణిదెల ప్రొడ‌క్షన్ కంపెనీ బేన‌ర్‌పై నిర్మిస్తున్నాడు రామ్ చరణ్.  కొద్దిసేప‌టి క్రితం పంద్రాగస్టు విషెష్ చెప్పిన సైరా టీం.. ఆగ‌స్ట్ 21 ఉద‌యం 11.30ని.లకి 'సైరా' టీజ‌ర్ విడుద‌ల చేస్తున్నట్టు ప్రక‌టించింది.

ఈ చిత్రంలో చిరంజీవి, అమితాబ్ బ‌చ్చన్‌, న‌య‌న‌తార‌, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిహారిక ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటిస్తోంది. అల్లుఅర్జున్ కూడా ఓ చిన్న పాత్ర చేస్తున్నాడని టాక్.  బాలీవుడ్ సంగీత ద‌ర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించ‌నున్నాడ‌ని సమాచారం. మూవీని వచ్చే ఏడాది స‌మ్మర్‌లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలతో పాటు వీలైనన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేయాలని యోచిస్తున్నారు.

Trending News