Keerthy Suresh Workout : కీర్తి సురేష్‌ వర్కౌట్లు.. పచ్చని గడ్డిలో అలా

Keerthy Suresh Workout మహానటి కీర్తి సురేష్‌ ప్రస్తుతం తెరపై అంతగా సందడి చేయడం లేదు. ఆమె నటించిన చిత్రాలన్నీ వరుసగా బెడిసి కొడుతూ వచ్చాయి. మహానటి తరువాత ఆమెకు సరైన హిట్ మాత్రం ఇంకా రావడం లేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2023, 01:58 PM IST
  • సోషల్ మీడియాలో కీర్తి సురేష్‌ హల్చల్
  • వర్కౌట్లు చేస్తూ వీడియో షేర్ చేసిన మహానటి
  • నెట్టింట్లో కీర్తి సురేష్‌ వీడియో వైరల్
Keerthy Suresh Workout : కీర్తి సురేష్‌ వర్కౌట్లు.. పచ్చని గడ్డిలో అలా

Keerthy Suresh Workout మహానటి కీర్తి సురేష్ ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. కానీ మహానటి తరువాత మళ్లీ అంత గొప్ప విజయాన్ని దక్కించుకోలేకపోయింది. లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. మహానటి తరువాత కోలీవుడ్, టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. స్టార్ హీరోలందరి సరసనా ఆమెకు అవకాశాలు వచ్చాయి. కానీ ఏ ఒక్కటి కూడా అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయింది.

మహానటి తరువాత కోలీవుడ్‌లో విశాల్, విజయ్, విక్రమ్ ఇలా అందరితోనూ సినిమాలు చేసింది. తెలుగులో అయితే పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి అంటూ ఇలా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పలకరించింది. ఇందులో ఏ ఒక్కటి హిట్ అవ్వలేదు. నితిన్‌తో చేసిన రంగ్ దే, మహేష్‌ బాబు సర్కారు వారి పాట ఇలా ఏ సినిమా కూడా కీర్తి సురేష్‌కు కావాల్సిన విజయాన్ని ఇవ్వలేదు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

ఇక కీర్తి సురేష్‌ బాలీవుడ్ ప్రాజెక్ట్‌ల కోసం వెయిట్ లాస్ అయినట్టుగా తెలుస్తోంది. బోనీకపూర్‌తో ఓ సినిమా చేయబోతోన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక కీర్తి సురేష్‌ మధ్యలో బక్క పల్చగా తయారై తన గ్లామర్‌ను పొగొట్టేసుకుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో శ్రీ రాఘవ ప్రధాన పాత్రలో వచ్చిన చిన్ని సినిమాలో అద్భుతంగా నటించేసి మెప్పించింది.

కీర్తి సురేష్‌ ఇప్పుడు నానితో కలిసి దసరా అనే సినిమా చేసింది. ఈ మూవీ వచ్చే నెలలో రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన నాని, కీర్తి సురేష్‌ లుక్స్ అదిరిపోయాయి. ఇక ఈ సినిమాతో నాని పాన్ ఇండియాకు వెళ్తున్నాడు. కీర్తి సురేష్‌కు సైతం ఇది ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా అవుతుంది.

కీర్తి సురేష్‌ తన పెట్ నైక్‌తో కలిసి ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రకృతితో మమేకం అవుతూ ఇలా యోగాలు, వర్కౌట్లు చేస్తే బాగుందంటూ కీర్తి సురేష్‌ వీడియోను షేర్ చేసింది. అందులో కీర్తి సురేష్‌ పెట్ సైతం కనిపిస్తోంది. ఇక ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

Also Read:  Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే

Also Read: SSMB 28 Look : మహేష్‌ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News