లారెన్స్ మూవీ: కాంచన-3 ట్రయిలర్ రివ్యూ...మీ కోసం

                                 

Last Updated : Mar 28, 2019, 02:45 PM IST
లారెన్స్ మూవీ: కాంచన-3 ట్రయిలర్ రివ్యూ...మీ కోసం

సౌత్ అంతటా సూపర్ హిట్ అయిన సిరీస్ లో ఒకటి కాంచన. ఇప్పుడా సిరీస్ నుంచి మరో మూవీ వస్తోంది. దాని పేరు కాంచన-3. మూవీ సెట్స్ పై ఉన్నప్పట్నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ ఎక్స్ పెక్టేషన్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కింది కాంచన-3. ఈరోజు విడుదలైన ట్రయిలర్ చూస్తే ఈ విషయం ఈజీగీ అర్థమైపోతుంది.

తన నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నారనే విషయం దర్శకుడు కమ్ హీరో లారెన్స్ కు బాగా తెలుసు. సరిగ్గా ఆ ఎలిమెంట్స్ నే కాంచన-3లో పెట్టాడు. అదిరిపోయే హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఈ ట్రయిలర్ లో ఉన్నాయి. దీనికి తోడు లారెన్స్ మాస్ లుక్, హీరోయిజం కూడా ట్రయిలర్ లో ఎలివేట్ అయింది.

లారెన్స్ తో పాటు సినిమాలో కీలక పాత్రలు పోషించిన హీరోయిన్లు ఒవియా, వేదిక, నిక్కీ తంబోలీకి ట్రయిలర్ లో చోటు కల్పించారు. కాంచన సిరీస్ లో స్టార్టింగ్ నుంచి ఉంటున్న కోవై సరళ, శ్రీమాన్ లుక్స్ ను కూడా ట్రయిలర్ లో చూపించారు.

సొంత బ్యానర్ పై తనే నటిస్తూ, తనే నిర్మిస్తూ, లారెన్స్ స్వయంగా డైరక్ట్ చేసిన ఈ సినిమాకు తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సినిమాలో రీ-రికార్డింగ్ తో పాటు గ్రాఫిక్స్ బాగుంటాయనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది. ఏప్రిల్ లో వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రాబోతోంది కాంచన-3

 

@ జీ సినిమాలు

Trending News