సూపర్ స్టార్ రజనీకాంత్ "కాలా" ట్రైలర్ విడుదల

సూపర్ స్టార్ రజనీకాంత్, పా రంజిత్ కాంబినేషనులో తెరకెక్కిన చిత్రం "కాలా". 

Last Updated : May 28, 2018, 10:35 PM IST
సూపర్ స్టార్ రజనీకాంత్ "కాలా" ట్రైలర్ విడుదల

సూపర్ స్టార్ రజనీకాంత్, పా రంజిత్ కాంబినేషనులో తెరకెక్కిన చిత్రం "కాలా". గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లోనే "కబాలి" విడుదలైంది. తాజాగా ముంబయి మురికివాడల్లో లీడర్‌గా సత్తా చాటిన "కరికాలన్" అనే డాన్ పాత్రలో రజనీకాంత్ నటించిన చిత్రం "కాలా" షూటింగ్ దశలోనే అభిమానులలో ఎంతో క్రేజ్‌ని సంపాదించుకుంది.  ఈ రోజే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను నిర్మాతలు ఆన్ లైన్ ద్వారా విడుదల చేశారు.

రజనీకాంత్‌తో పాటు సముద్రఖని, నానా పటేకర్, హూమా ఖురేషి, అంజలి పాటిల్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్ నటించగా, కుమారుడి పాత్రంలో దిలీపన్ నటించారు. వండ‌ర్ బార్ ఫిలింస్ బేన‌ర్‌పై ధనుష్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 7వ తేదిన విడుదల కానుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుక చెన్నైలో రంగరంగ వైభవంగా జరిగింది. 

"కాలా" చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. జి మురళీ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తోంది. 

Trending News