Jio Cheape Recharge Plan: జియో 'సూపర్' ప్లాన్‌.. ఎయిర్‌టెల్ వినియోగదారులు అసూయపడక తప్పదు!

Reliance Jio Introduces 2 New Prepaid Plans with 2.5GB and Unlimited Calling. రిలయన్స్‌ జియో రెండు బిగ్ బ్యాంగ్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ ఆఫర్‌తో ఎయిర్‌టెల్ వినియోగదారులు అసూయపడక తప్పదు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 21, 2023, 12:45 PM IST
  • జియో 'సూపర్' ప్లాన్‌
  • ఎయిర్‌టెల్ వినియోగదారులు అసూయపడక తప్పదు
  • రూ. 899 ప్లాన్‌లో 90 రోజుల చెల్లుబాటు
Jio Cheape Recharge Plan: జియో 'సూపర్' ప్లాన్‌.. ఎయిర్‌టెల్ వినియోగదారులు అసూయపడక తప్పదు!

Reliance Jio Introduces 2 New Prepaid Plans with 2.5GB and Unlimited Calling: కస్టమర్లను ఆకట్టుకునేందుకు పలు టెలికాం సంస్థలు నిత్యం ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తక్కువ రీఛార్జ్‌తో ఎక్కువ బెనిఫిట్స్‌ వచ్చేలా ఎప్పటికప్పుడు ప్లాన్స్‌ ప్రకటిస్తున్నాయి. ఈ విషయంలో 'రిలయన్స్‌ జియో' ముందువరసలో ఉంటుంది. తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు ఎన్నో కొత్త ప్లాన్‌లను తీసుకువస్తుంటుంది. ఈ క్రమంలోనే జియో తన వినియోగదారుల కోసం సూపర్ రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ఆఫర్‌తో ఎయిర్‌టెల్ వినియోగదారులు అసూయపడక తప్పదు. ఆ ప్లాన్ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం. 

రిలయన్స్‌ జియో రెండు బిగ్ బ్యాంగ్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ ప్లాన్‌ల ధర చాలా తక్కువ. ఈ రెండు ప్లాన్‌ల ధరలో ఒకటి రూ. 899 కాగా.. మరొకటి రూ. 349. ఈ రెండు ప్లాన్‌లు మై జియో యాప్ (My Jio APP), జియో (Jio) అధికారిక వెబ్‌సైట్ మరియు ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. రూ. 899 ప్లాన్‌లో 90 రోజుల చెల్లుబాటు ఉంటుంది. ఇది కాకుండా ప్రతిరోజూ అపరిమిత కాలింగ్ మరియు 2.5 GB డేటా వాడుకోవచ్చు. 

Reliance Jio 349 Prepaid Plan Details:
రిలయన్స్ జియో రూ.349 ప్లాన్ 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2.5GB డేటా లభిస్తుంది. అంతేకాకుండా అపరిమిత కాలింగ్ మరియు ప్రతిరోజూ 100 SMSలు వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తం 75 GB డేటాను వాడుకోవచ్చు. JioTV, JioCinema, JioSecurity మరియు JioCloud లాంటి ఇతర ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇక వెల్‌కమ్ ఆఫర్‌లో 5G డేటా కూడా అందుబాటులో ఉంటుంది.

Reliance Jio 899 Prepaid Plan Details:
జియో రూ. 899 ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. రోజుకు 2.5GB డేటాను వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ అపరిమిత కాలింగ్ మరియు 100 SMSలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌లో మొత్తం 225GB డేటాను వాడుకోవచ్చు. వెల్‌కమ్ ఆఫర్ కింద 5G డేటా లభిస్తుంది. రూ. 349 ప్లాన్‌లో లభించే ప్రయోజనాలు అన్ని అందుబాటులో ఉన్నాయి. 

ప్రతి రోజు ఎక్కువ డేటాను ఉపయోగించుకునేవారికి ఈ రెండు ప్లాన్‌లు బాగా ఉపయోగపడనున్నాయి. ఈ ప్లాన్‌ల ప్రయోజనాలు చూసి.. ఎయిర్‌టెల్ వినియోగదారులు అసూయపడక తప్పదు. జియో భారతదేశంలోని 100 కంటే ఎక్కువ నగరాల్లో 5G సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి భారతదేశం అంతటా 5G సేవలను అమలు చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

Also Read: Tata Car Sales 2022: హ్యుందాయ్, మారుతిని కొట్టేసి.. గేమ్ గెలిచేసిన టాటా!

Also Read: IND vs NZ: విజయం ఉత్సాహంలో ఉన్న భారత్‌కు బిగ్‌ షాక్‌.. భారీ జరిమానా! తప్పిదాన్ని అంగీకరించిన రోహిత్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News