వరుసగా రెండో రోజు దిగొచ్చిన బంగారం ధరలు...

కరోనా మహమ్మారి విజృంభణతో కొద్దిరోజులుగా భగ భగ మండిన బంగారం ధరలు మంగళవారం వరుసగా రెండో రోజూ పడిపోయాయి. స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టడం, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు లాక్‌డౌన్‌ల నుంచి సడలింపులు

Last Updated : Apr 28, 2020, 09:30 PM IST
వరుసగా రెండో రోజు దిగొచ్చిన బంగారం ధరలు...

హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభణతో కొద్దిరోజులుగా భగ భగ మండిన బంగారం ధరలు మంగళవారం వరుసగా రెండో రోజూ పడిపోయాయి. స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టడం, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు లాక్‌డౌన్‌ల నుంచి సడలింపులు ప్రకటిస్తుండటంతో బంగారం ధరల జోరుకు బ్రేక్‌ పడింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం రూ 286 తగ్గి రూ 45,905 వద్ద ఆగింది. మరోవైపు కిలో వెండి రూ 400 తగ్గి రూ 41,558కి పడిపోయింది. వివిధ కరెన్సీలతో డాలర్‌ మారకం విలువ పెరగడంతో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. పసిడి రికార్డు ధరలకు చేరుతుండటంటంతో ఆయా కంపెనీలు లాభాల స్వీకరణకు దిగడం కూడా బంగారం ధరల పతనానికి కారణమని బులియన్‌ ట్రేడర్లు పేర్కొంటున్నారు. 

Also Read: COVID-19 cases in Telangana: తెలంగాణలో తగ్గిన కరోనా వైరస్ వ్యాప్తి

మరోవైపు పలు దేశాలు ఆర్థిక వ్యవస్థలు కోలుకునేందుకు చేపడుతున్న తాత్కాలిక ప్యాకేజ్‌లతో మదుపుదారులు షేర్ల కొనుగోలుకు మొగ్గుచూపడంతో దీనికి ఆదరణ తగ్గిందని భావిస్తున్నారు. బంగారం ధరల్లో మరికొన్ని రోజులు ఒడిదుడుకులు కొనసాగినా రానున్న రోజుల్లో బంగారం ధరలు నిలకడగా పెరుగుతాయని బులియన్‌ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News