డియర్ జిందగీ: జీవితం 'సర్కస్' కాకూడదు సుమా !

ఈ జీవితం మనది..మన జీవన ప్రయాణాన్ని మనమే నిర్దేశించుకోవాలి. సరైన నిర్ణయాలతో ముందుకు వెళ్లాలి..గెలుపు ఓటములకు మనమే బాధ్యత వహించాలి..ఎవరో వస్తారు..ఏదో చేస్తారనే ధోరణి నుంచి మనం బయటపడినప్పుడే జీవితం మన చేతిలోకి వస్తుంది.. అప్పుడే మనకు నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుంది.

Last Updated : Jul 2, 2018, 10:23 PM IST
డియర్ జిందగీ: జీవితం 'సర్కస్' కాకూడదు సుమా !

దయాశంకర్ మిశ్రా, డిజిటల్ ఎడిటర్, జీ న్యూస్ హిందీ

సర్కస్, నేషనల్ పార్క్ మధ్య ఉన్న తేడా ఏమిటి! రెండు చోట్లకు వెళ్ళినవారు అసలు విషయం చెప్తారు. వెళ్ళనివారు, ఇతరుల మాటల ఆధారంగా కథను అల్లుకొని చెప్తారు. కానీ అడవి జంతువుల మనస్తత్వం, స్వేచ్ఛ, వాటి ప్రవర్తన గురించి చెప్పడం వారికి కూడా కష్టమే..!

సర్కస్ విషయానికి వద్దాం. అక్కడ జంతువులు శిక్షణ పొందుతాయి. సమయానికి 'ఆహారం' దొరుకుతుంది. వాటికి వేటగాడు, జంతువులు, మనుషులు అనే భయముండదు. ఇప్పుడు నేషనల్ పార్కుల విషయానికి వద్దాం. ఇక్కడ ప్రతి అడుగు ముప్పే, సవాలే. అయినా సంతోషంగా, స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ఆహారం కోసం నిత్యం అన్వేషిస్తూ ఉంటాయి. ఆలోచనలు మారవచ్చు, కానీ ఎవరైనా కోరుకొనేది జీవితంలో సంతోషం, స్వేచ్ఛగా ఉండాలని! ఎవ్వరూ స్వేచ్ఛ లేకుండా ఉండాలని కోరుకోరు కదా..!

మీరు నమ్ముతారో లేదో గానీ మనం నేషనల్ పార్కులో ఉన్న స్వేచ్ఛను పొందటం లేదు. సర్కస్‌లో ఉన్న జీవితాన్ని గడుపుతున్నాం. శాంతి, సౌకర్యాల కోసం వెతుక్కుంటున్నాం. గాలిపటం యజమాని దారం కొనేవాడు కాదు గాలిపటంలా ఎగిరేవాడు అని అన్నట్లు..! అందుకే మనం మన జీవితం అనే దారాన్ని ఇతరులకు ఇవ్వొద్దు.

మీ ఆలోచనలతో సొంత నిర్ణయాలు తీసుకోండి. అది తప్పు కావచ్చు..అయినా జరగనివ్వండి. చివరగా ఇది నా నిర్ణయం అనే ఒక ఆత్మసంతృప్తి అయినా కలుగుతుంది.

నిర్ణయం తీసుకొనేటప్పుడు ఇతరులపై ఆధారపడరాదు. జీవితం చాలా విలువైనది. నిర్ణయాలను మనమే తీసుకుందాం. మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకుందాం.

ఆలోచన, అవగాహన, నిర్ణయాలు.. వంటివి మనుషులకు ప్రకృతికి ఇచ్చిన గొప్ప బహుమానాలు. కానీ యాంత్రిక జీవనంవల్ల నిరాశ, నిస్పృహలకు లోనవుతూ.. జీవితంలో మనకు మనమే కంట్రోల్ తప్పుతున్నాం.

మనుషులు నిర్ణయం తీసుకోవడం అనేది ఒక అందమైన ఆలోచనా ప్రక్రియ. మనం జీవితంలో ఏమౌతామనేదానికి మన నిర్ణయాలే సోపానాలు. కానీ మనం చేస్తున్నదేమిటీ? జీవితంలో అవసరమైన నిర్ణయాలను తీసుకొనేటప్పుడు భయపడుతున్నాం.. దూరంగా పారిపోతున్నాం.   

ఓ ఉదాహరణకు వస్తే.. పిల్లలు ఏం చదివాలి, ఎక్కడ చదివించాలి అనే నిర్ణయాలను సొంతంగా తీసుకోరు. పెళ్లి, పిల్లల సంరక్షణ, కెరీర్ వంటి నిర్ణయాల కోసం మనం ఇతరుల మీద ఆధారపడుతుంటాము. జీవితంలో తీసుకొనే అతి ముఖ్యమైన నిర్ణయాలకు ఇతరుల మీద ఆధారపడటం మానుకోండి.  ఆలోచన, అవగాహన, నిర్ణయాలను మనమే ఫాలో అవుదాం.

పై మూడు లక్షణాలు కాకుండా.. శాస్త్రీయ పద్దతిని అనుసరించే వ్యక్తులు మనలో ఎంతమంది ఉన్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు విషయానికే వద్దాం. ఉత్తర భారతదేశంలో అబ్బాయిలు, అమ్మాయిలకు మధ్య వ్యత్యాసం ఉంది. అందుకు ఉదాహరణ పెళ్ళిళ్ళ సమయంలో వరుడు, వధువుల ప్రవర్తనే. పెళ్ళికొడుకు పక్షాన ఉన్నవారి ప్రవర్తన హుందాగా ఉంటుంది. ఇక్కడ మంచి చెడుల గురించి కాదు.. వారి వైఖరి ఎలా ఉందో చెప్పడమే. ఇప్పుడిప్పుడే బాలికల విద్యకు అడ్డంకులు తొలగిపోతున్నాయి. వారు చదువుకోవడానికి కుటుంబం నుంచి బయటికి వస్తున్నారు. కానీ చదువు తర్వాత వారి కెరీర్, పెళ్లి అనే సవాళ్లపై మనం 'సర్కస్' తరహా వైఖరిని ప్రదర్శిస్తున్నాం.

 మనం ఇప్పటికీ అమ్మాయిలను శాసించే సమాజంగా పరిగణించబడుతున్నాము. పిల్లలు, మహిళలపై స్పందించే తీరుకు మన ప్రవర్తనే బలమైన సాక్ష్యాలు.

ఏమి చదవాలి? ఏ మార్గాన్ని ఎంచుకోవాలనేది మన చేతుల్లోనే ఉంది. పిల్లలను పెంచేటప్పుడు ఒక ఫీలింగ్ తో, ఆతరువాత మరో ఫీలింగ్ తో ఉంటున్నాము. పిల్లలను నియంత్రించాలానే మన కోరిక మనల్ని మానసిక రోగులుగా మార్చడానికి ప్రేరేపిస్తుంది.

పిల్లల్లో విజయం సాధించాలనే తపన, తన లక్ష్యాలను నెరవేర్చుకోవాలనే కోరిక మనల్ని చాదస్తం వైపు తీసుకెళ్తాయి. మనకు అలానే ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి మనము అలానే వెళ్తాం. ఇలా చేయడం వల్ల మనం ప్రస్తుతం ఈ పరిస్థితికి వచ్చాం అన్నది గుర్తించుకోవాలి.

చివరగా కెరీర్ గురించి. ఉద్యోగం. ఇక్కడ కూడా మనం మన స్వంత నిర్ణయాలపై ఇతరులపై ఆధారపడి ఉంటాము. ఉరుముల్ని చూసి వాతావరణాన్ని అర్థం చేసుకోనంత వరకు రెయిన్ కోట్ కంపెనీలు ఎండాకాలంలో కూడా రెయిన్ కోట్లను అమ్ముతారు.

అందుకే కెరీర్ విషయంలో ఒక భవిష్య దృష్టి అవసరం. అందరినీ గౌరవించండి.. ప్రతి ఒక్కరితో కలిసి ఉండండి. కానీ ఎల్లప్పుడూ మీరే నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే జీవితం మనది. మన  జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. సర్కస్ లో సింహాలు రింగ్ మాస్టర్ చెప్పినట్లు నాట్యం చేస్తుంది. జీవితం'సర్కస్' కాదని.. మీరు మనుషులు అని అర్థం చేసుకోండి.

ఈ జీవితం మనది..మన జీవన ప్రయాణాన్ని మనమే నిర్దేశించుకోవాలి. సరైన నిర్ణయాలతో ముందుకు వెళ్లాలి..గెలుపు ఓటములకు మనమే బాధ్యత వహించాలి..ఎవరో వస్తారు..ఏదో చేస్తారనే ధోరణి నుంచి మనం బయటపడినప్పుడే జీవితం మన చేతిలోకి వస్తుంది.. అప్పుడే మనకు నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుంది.

ఈ ఆర్టికల్‌ని హిందీలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి :- डियर जिंदगी : ‘सर्कस’ होने से बचिए...

(ఈ ఆర్టికల్‌పై మీ సలహాలు, సూచనలు తెలియచేయండి: https://www.facebook.com/dayashankar.mishra.54, https://twitter.com/dayashankarmi)

 

Trending News