టాలీవుడ్‌లో నటించిన బాలీవుడ్ హీరోలు వీరే..!

టాలీవుడ్‌లో అప్పుడప్పుడు ఇతర భాషా నటులు నటించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందులో అధికశాతం మంది ఎక్కువగా విలన్లగా నటిస్తుంటారు. అందులో హిందీ నటులు కూడా ఉండడం గమనార్హం. 

Last Updated : Mar 28, 2018, 09:14 AM IST
టాలీవుడ్‌లో నటించిన బాలీవుడ్ హీరోలు వీరే..!

టాలీవుడ్‌లో అప్పుడప్పుడు ఇతర భాషా నటులు నటించడం మనం చూస్తూనే ఉన్నాం. అందులో అధికశాతం మంది విలన్లగా నటిస్తుంటారు. అలాంటి వారిలో హిందీ నటులు కూడా ఉండడం గమనార్హం. ఈ క్రమంలో బాలీవుడ్‌లో హీరోలుగా నటించి కూడా.. టాలీవుడ్‌లో హీరో, విలన్ పాత్రలతో పాటు అతిథి పాత్రల్లో నటించిన వారి గురించి  తెలుసుకుందాం. 

సంజీవ్ కుమార్ - బాలీవుడ్‌లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుపరిచితుడైన నటుడు సంజీవ్ కుమార్. కిలోనా, యహీ హై జిందగీ, షికార్ లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఆయన షోలే చిత్రంలోని ఠాకూర్ పాత్ర ద్వారా మరింత పాపులారిటీని కైవసం చేసుకున్నారు. అలాంటి సంజీవ్ కుమార్ ఓ తెలుగు చిత్రంలో నటించారు. 1974లో శారద ప్రధాన పాత్రలో నటించిన "ఊర్వశి" చిత్రంలో సంజీవ్ కుమార్ హీరోగా నటించారు. 

అమితాబ్ బచ్చన్  - జగమెరిగిన సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఆయన పలు తెలుగు సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించారు. 2014లో విడుదలైన "మనం" చిత్రంలో అమితాబ్ చాలా చిన్న పాత్రలో కనిపిస్తారు. అలాగే ప్రస్తుతం ఆయన మెగస్టార్ చిరంజీవి నటిస్తున్న "సైరా నరసింహారెడ్డి"చిత్రంలో కూడా అతిథి పాత్ర పోషిస్తున్నారు.

మిథున్ చక్రవర్తి - హిందీ చలన చిత్ర పరిశ్రమను ఒక దశాబ్దం పాటు ఒక్క ఊపు ఊపిన నటుడు మిథున్ చక్రవర్తి. ఇటీవలి కాలంలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణిస్తున్నారు. ఓ మై గాడ్ చిత్రానికి తెలుగు రీమేక్‌గా వచ్చిన "గోపాల గోపాల" చిత్రంలో మిథున్ చక్రవర్తి స్వామిజీ పాత్రలో నటించారు

సంజయ్ దత్ - సంజయ్ దత్‌కి, టాలీవుడ్ నటుడు నాగార్జునకు ఉన్న స్నేహం కారణంగా, ఆయన నాగ్ నటించిన ఓ చిత్రంలో అతిథి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నారు. 1997లో నాగ్ నటించిన "చంద్రలేఖ" చిత్రంలో సంజయ్ దత్, ఓ మెంటల్ పేషెంట్ పాత్రలో నటించారు. 

నీల్ నితిన్ ముఖేష్ - బాలీవుడ్‌‌కి హీరోగా పరిచయమైనా.. ఆ తర్వాత విలన్ పాత్రలు కూడా పోషించిన నటుడు నీల్ నితిన్ ముఖేష్. ఆయన ప్రభాస్ నటిస్తున్న "సాహో" చిత్రంలో నెగటివ్ క్యారెక్టర్ పోషిస్తున్నారు. 

రవికిషన్ - హిందీతో పాటు భోజ్‌పూరీ భాషల్లో హీరోగా నటించిన రవికిషన్.. అనేక తెలుగు చిత్రాల్లో నటించారు. రేసుగుర్రం, కిక్ 2 లాంటి చిత్రాలు తనకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి

అర్జన్ భజ్వా - సంపంగి, నీతోడు కావాలి లాంటి చిత్రాలతో తెలుగులో దీపక్ పేరుతో హీరోగా పరిచయమయ్యారు అర్జన్ భజ్వా. ఆయన పలు బాలీవుడ్ చిత్రాల్లో హీరో పాత్రలతో పాటు సహాయక పాత్రలు కూడా పోషించారు. 

జుగల్ హన్సరాజ్ - "మాసూమ్" చిత్రంతో హిందీలో బాలనటుడిగా రంగప్రవేశం చేసిన నటుడు జుగల్ హన్సరాజ్. ఆ తర్వాత పాపా కెహెతా హే, మొహబ్బతే లాంటి సూపర్ హిట్ చిత్రాలలో కూడా నటించారు. 2005లో తరుణ్ హీరోగా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన "సోగ్గాడు" చిత్రంలో జుగల్ హన్సరాజ్ సెకండ్ హీరోగా నటించారు

సచిన్ జోషి - తెలుగులో "మౌనమేలనోయి" చిత్రంతో పరిచయమైన సచిన్ జోషి.. బాలీవుడ్‌లో కూడా హీరోగా, సహాయ నటుడిగా నటించారు. ఆజాన్ పేరు విడుదలైన భారీ బడ్జెట్ హిందీ చిత్రాన్ని ఆయన హీరోగా సొంత బ్యానరులో నిర్మించారు.

సోనూ సూద్ -"ఏక్ వివాహ్.. ఐసీ భీ"తో పాటు పలు బాలీవుడ్ చిత్రాలలో హీరోగా నటించిన సోనూ సూద్, తెలుగులో అనేక చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించారు. అరుంధతి, కందిరీగ లాంటి చిత్రాలకు తనకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి. 

 

Trending News