Bobby Deol in Pushpa 2: పుష్ప సినిమాలో బాలీవుడ్ స్టార్.. రచ్చ రేపుతున్న సుకుమార్ ప్లానింగ్!

Bobby Deol as main villain opposite Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 19, 2022, 12:42 PM IST
  • తెలుగులో మూవీ చేయనున్న బాబీ డియోల్
  • పుష్ప 2లో నటిస్తున్నారంటూ ప్రచారం
  • త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం
Bobby Deol in Pushpa 2: పుష్ప సినిమాలో బాలీవుడ్ స్టార్.. రచ్చ రేపుతున్న సుకుమార్ ప్లానింగ్!

Bobby Deol to play the main villain opposite Allu Arjun in Pushpa 2: ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నటీనటులను తీసుకువచ్చి టాలీవుడ్ సినిమాల్లో నటింపజేయడం కొత్త ట్రెండ్గా మారింది. గతంలోనే ఈ ట్రెండు ఉన్నా సరే ఈ మధ్యకాలంలో అది మరింత పెరిగింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో కనిపించారు. ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు ఒక తెలుగు సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

ఆయన ఎవరో కాదు విజయ్ సింగ్ డియోల్ అలియాస్ బాబీ డియోల్ గా పేరొందిన ఆయన బాలీవుడ్ లో అనేక హిట్ సినిమాల్లో నటించారు. ఇటీవల ఆశ్రమం వంటి వెబ్ సిరీస్ ద్వారా కూడా ఆయన పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇప్పుడు ఆయనని ఒక టాలీవుడ్ సినిమాలో విలన్ పాత్ర కోసం తీసుకోబోతున్నట్టు ప్రచారం మొదలైంది. అయితే ఆ సినిమా ఏది? అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. నిజానికి గతంలో ఆయన పుష్ప పార్ట్ 1 సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది.

అయితే ఫహద్ ఫాజిల్ తెరమీదకు రావడంతో బాబీ డియోల్ పేరు కనుమరుగయింది. ఇప్పుడు మరోసారి బాబీ డియోల్ టాలీవుడ్ లో ఒక పాన్ ఇండియా మూవీలో విలన్ పాత్రలో నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన పుష్ప 2లో విలన్ గా నటిస్తున్నారు అనే ప్రచారం ఇప్పుడు తెరమీదకు వచ్చింది. నిజానికి పుష్ప పార్ట్ 1లో ఫహద్ ఫాసిల్ కు సరైన స్క్రీన్ స్పేస్ లేకపోవడంతో రెండో సినిమాలో ఆయన మెయిన్ విల్లన్ అని ప్రచారం జరిగింది. కానీ తరువాత విజయ్ సేతుపతి పేరు తెరమీదకు వచ్చింది.

అయితే ఇప్పుడు సినిమాని నార్త్ లో కూడా ప్రేక్షకులు మరింత ఆదరించే విధంగా రూపొందించాలని మేకర్స్ భావిస్తున్న నేపథ్యంలో నార్త్ నుంచి ఒక పేరు ఉన్న హీరోని దింపాలని భావిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే సుకుమార్ అండ్ టీం బాబీ డియోల్ ని సంప్రదించగా ఆయన కథ విని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ వర్క్ మీద ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అయితే ఇందులో ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది సినిమా షూటింగ్ ప్రారంభమయితే కానీ ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది.

మరోపక్క ఆయనని మహేష్ బాబు 28వ సినిమాకి తీసుకుంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు 28వ సినిమాగా ప్రస్తుతానికి సంబోధించబడుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలో విలన్ చాలా బలంగా ఉంటాడు. హీరోతో సై అంటే సై అన్నట్టు విలన్ పాత్ర కూడా త్రివిక్రమ్ తీర్చిదిద్దుతూ ఉంటాడు/ ఈ నేపథ్యంలోనే మహేష్ బాబుకు విలన్ గా బాబీ డియోల్ ను దింపుతున్నారనే ప్రచారం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే బాబీ డియోల్ ఏ సినిమాలో నటిస్తున్నారనే విషయం మీద క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడక తప్పదు. 

Also Read: Comedian Harsha Chemudu : పెళ్లై ఏడాది.. కాశ్మీర్ లోయలో సందడి.. భార్యతో కమెడియన్ హర్ష ట్రిప్

Also Read: Allu Sirish Breakups: పెద్దింటి అమ్మాయితో అల్లు శిరీష్ బ్రేకప్.. ప్రమోషన్స్ లో బరస్ట్ అయిన హీరో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News