Atharva Movie Review: క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ జానర్లలో వచ్చే చిత్రాల మీద ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. కరోనా తరువాత ఇలాంటి జానర్లనే జనాలు ఎక్కువగా ఇష్టపడుతన్నారు. క్రైమ్ అంటే అందరికీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ గుర్తుకు వస్తుంది. కానీ క్లూస్ టీం ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయడమే అథర్వలో కొత్త పాయింట్. కార్తీక్ రాజు సిమ్రన్ చౌదరి ఐరాలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని మహేష్ రెడ్డి తెరకెక్కించాడు. ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో వేసిన ప్రీమియర్స్ నుంచి టాక్ బయటకు వచ్చింది.
కథ
దేవ్ అథర్వ కర్ణ (కార్తీక్ రాజు) పోలీస్ అవ్వాలి.. ఎలాగైనా కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేయాలని కలలు కంటూ ఉంటాడు. కానీ అతనికి ఆస్తమా ఉంటుంది.దీని కారణంగా పోలీస్ సెలక్షన్లలో ఫెయిల్ అవుతాడు. కానీ పట్టు పట్టి క్లూస్ టీంలో జాయిన్ అవుతాడు. తన తెలివితో దొంగతనాల కేసును క్షణాలో పరిష్కరిస్తాడు. ఈ క్రమంలోనే తన కాలేజ్ మేట్ అయిన నిత్య (సిమ్రన్ చౌదరి) క్రైమ్ రిపోర్టర్‌గా మళ్లీ తన జీవితంలోకి వస్తుంది. ఆమె మీదున్న ప్రేమను మాత్రం బయటకు చెప్పలేకపోతాడు కర్ణ. నిత్య ఫ్రెండ్ జోష్ని (ఐరా) పెద్ద హీరోయిన్. జోష్ని ఇంట్లోనే జోష్ని, ఆమె ప్రియుడు శివ (శివ) శవాలై పడి ఉంటారు. ప్రేయసి మీదున్న అనుమానంతోనే ఆమెను చంపి.. అతను కూడా సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు కేసు కొట్టేస్తారు. అక్కడ మర్డర్ జరిగిందని, వేరే వ్యక్తి చంపాడని ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో కేసును అలా ముగించేస్తారు. కానీ నిత్య మాత్రం ఆ విషయాన్ని నమ్మదు. ఇక కర్ణ సైతం ఆ కేసును సాల్వ్ చేయాలని అనుకుంటాడు. అసలు జోష్ని, శివల నేపథ్యం ఏంటి? వాళ్లిద్దరినీ ఎందుకు చంపారు? ఎవరు చంపారు? అసలేం జరిగి ఉంటుంది? ఒక్క క్లూ కూడా లేని ఈ కేసును కర్ణ ఎలా పరిష్కరించాడు? అన్నది థియేటర్లో చూడాల్సిందే.
నటీనటులు
కార్తీక్ రాజు పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఫ్రెండ్స్‌తో ఉన్న టైంలో కామెడీ, కేసును చేదించే టైంలో సీరియస్ నెస్, ప్రేయసితో ఉన్నప్పుడు లవ్ యాంగిల్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ చూపించాడు. హీరోయిజం కోసం కావాలని సీన్లు, ఫైట్లు పెట్టుకోలేదు. సహజంగా నటించాడు. హీరోయిన్ సిమ్రన్ చౌదరి తెరపై అందంగా కనిపించింది. సినిమాలో సినిమా హీరోయిన్ జోష్నిగా కనిపించిన ఐరా కూడా ఓకే అనిపిస్తుంది. పోలీసు పాత్రలు బాగున్నాయి. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు ఓకే అనిపిస్తాయి.
విశ్లేషణ
దర్శకుడు మహేష్ రెడ్డి రాసుకున్న కథ, కథనం బాగుంది. ఈ ఫార్మాట్‌లో ఇది వరకు చాలానే కథలు వచ్చాయి. కానీ ఓ పోలీస్ కాకుండా.. ఓ క్లూస్ టీం ఆఫీసర్ ఎలాంటి క్లూలు లేకుండా ఇన్వెస్టిగేట్ చేయడమే కొత్తగా ఉంటుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లలో వచ్చే చిత్రాలు ఒకసారి చూశాక.. రెండో సారి ట్విస్టులు అన్నీ తెలిసిపోవడంతో అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించకపోవచ్చు. కానీ అథర్వ మాత్రం అలా అనిపించకపోవచ్చు. అథర్వ సినిమాలోనూ కొన్ని లోపాలున్నాయి. కానీ ఎంగేజింగ్‌గా తీయడంలో సక్సెస్ అయ్యాడు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
ప్రథమార్దం కాస్త స్లోగా సాగుతుంది. అసలు కథ ప్రారంభించడానికి కాస్త టైం తీసుకుంటాడు. రాబరీ కేసు నుంచి సినిమా పుంజుకుంటుంది. హీరోయిన్ జోష్ని మర్డర్‌తో ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్‌కు మరింత ఇంట్రెస్ట్ కలుగుతుంది. అయితే ద్వితీయార్దం ప్రారంభం మళ్లీ నెమ్మదించినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ తరువాత సినిమా పరుగులు పెడుతూనే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. ఈ క్రమంలో అప్పటి వరకు చూసిన అంతా ఒకెత్తు అయితే.. చివర్లో ఒకెత్తులా ఉంటుంది. ఇక అథర్వ రెండో పార్ట్‌కి కూడా మంచి లైన్‌ను రెడీ చేసుకున్నాడు. ఇలా మొత్తానికి దర్శకుడు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలం అయ్యాడనిపిస్తోంది.
టెక్నికల్‌గా ఈ సినిమా అదిరిపోతుంది. కెమెరామెన్ చరణ్ మాధవనేని ఇచ్చిన విజువల్స్.. సినిమా మూడ్‌ను బాగానే క్యారీ చేసింది. శ్రీ చరణ్ పాకాల పాటలు బాగుంటాయి. కానీ ఆర్ఆర్ మీదే అందరి దృష్టి పడుతుంది. ఎడిటర్ ఈ సినిమాను షార్ప్ అండ్ క్రిస్పీగానే కట్ చేశాడు. సెకండాఫ్ పరుగులు పెట్టినట్టుగా అనిపిస్తుంది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా బాగానే ఖర్చు చేసినట్టుగా కనిపిస్తోంది. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చినట్టే కనిపిస్తోంది.
రేటింగ్ 3
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి