ట్విట్టర్ తీరుపై మండిపడ్డ అమితాబ్ బచ్చన్

సెలబ్రిటీలకు బయటే కాదు.. సోషల్ మీడియాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.

Last Updated : Feb 1, 2018, 07:13 PM IST
ట్విట్టర్ తీరుపై మండిపడ్డ అమితాబ్ బచ్చన్

సెలబ్రిటీలకు బయటే కాదు.. సోషల్ మీడియాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ముఖ్యంగా సినీ గ్లామర్ కు ట్విట్టర్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ట్విట్టర్ లో ఎక్కువసేపు గడుపుతూ అభిమానులను ఆకట్టుకుంటారు. కుర్రకారుకు ఏమాత్రం తీసిపోకుండా.. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే బాలీవుడ్ నటుల్లో అమితాబ్ ఒకరు.

అమితాబ్ ను ట్విట్టర్ లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 32,902,353. అయితే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఆ సంఖ్యను దాటేశారని.. షారుఖ్ కు ట్విట్టర్ లో 32, 944, 338 మంది ఫాలోయింగ్ ఉందని ట్విట్టర్ తెలిపింది. దీంతో బిగ్ బీకి కోపం వచ్చింది. ట్విట్టర్ పెద్ద జోక్ అని.. తన ఫాలోయర్ల సంఖ్యను తగ్గించిందని బిగ్ బీ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ కు బైబై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

 

Trending News