లైవ్ వీడియో : అమర్ అక్బర్ ఆంటోని ప్రీ రిలీజ్ ఈవెంట్

అమర్ అక్బర్ ఆంటోని ప్రీ-రిలీజ్ ఈవెంట్ లైవ్

Last Updated : Nov 11, 2018, 12:49 AM IST
లైవ్ వీడియో : అమర్ అక్బర్ ఆంటోని ప్రీ రిలీజ్ ఈవెంట్

శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోని మూవీ నవంబర్ 16న ఆడియెన్స్ ముందుకు రానుండగా ఇవాళ సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరుగుతున్న ఈ సినిమా ఈవెంట్ ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. మాస్ మహారాజ రవితేజ, శ్రీను వైట్ల కాంబోలో గతంలో నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను చిత్రాలు రాగా మళ్లీ 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. 

ఈ సినిమా ఫంక్షన్‌లోనే అమర్ అక్బర్ ఆంటోని ట్రైలర్‌ని రిలీజ్ చేయనుండటంతో అభిమానుల దృష్టి అంతా ఈ ఈవెంట్‌పైనే ఉంది.

Trending News