Ajith Thunivu : తెలుగు టైటిల్ ఇదే.. అజిత్‌ టార్గెట్ ఎన్ని కోట్లంటే?

Ajith Thunivu Telugu Title అజిత్ నటించిన తునివు సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఈ మూవీకి తెలుగులో తెగింపు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2022, 10:21 AM IST
  • తెలుగులో రాబోతోన్న అజిత్ తునివు
  • పరిశీలనలో తెగింపు టైటిల్?
  • మూడు కోట్ల టార్గెట్‌తో బరిలోకి
Ajith Thunivu : తెలుగు టైటిల్ ఇదే.. అజిత్‌ టార్గెట్ ఎన్ని కోట్లంటే?

Ajith Thunivu Telugu Title తమిళ హీరోల చిత్రాలకు తెలుగులో మంచి గిరాకీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక అజిత్, విజయ్ వంటి హీరోలకు ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. ఈ సారి సంక్రాంతికి గట్టి పోటీ ఉండబోతోంది. కోలీవుడ్‌లో విజయ్ అజిత్ మధ్య ఉంటే.. తెలుగులో బాలయ్య చిరు మధ్య బాక్సాఫీస్ పోటీ ఉండబోతోంది. ఇక తెలుగులో విజయ్ అజిత్‌లు కూడా తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే వారిసు సినిమాను తెలుగులో పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తుండటంపై వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అజిత్ తునివు సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేయబోతోన్నారట.  ఈ మేరకు ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను తెలుగులో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్, ఐవీవై ప్రొడక్షన్స్ కలిసి రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాకు తెగింపు అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ మూవీని మూడు కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఒక వేళ సినిమాకు గనుక పాజిటివ్ టాక్ వస్తే ఈ మూడు కోట్లను రికవరీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. 

అంటే తక్కువ టార్గెట్‌తో దిగుతున్న అజిత్ తునివు సినిమా మొదటగా బ్రేక్ ఈవెన్ అయ్యే చాన్స్ ఉంది. బాలయ్య, చిరు, విజయ్ ఇలా అందరూ కూడా పెద్ద పెద్ద టార్గెట్లతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. వీటిలో ఏ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందో.. ఏ సినిమాకు కలెక్షన్లు వస్తాయో చూడాలి.

అయితే తునివు సినిమా గురించి దర్శకుడు వినోద్ చెబుతున్నమాటలు మాత్రం పొంతన లేకుండా ఉన్నాయి. అజిత్‌ ఈ మూవీ కథ మొత్తం కూడా వినలేదని, ఒకే ఒక్క సీన్ చెప్పాను అని, ఆ సీన్ నచ్చి సినిమాకు ఓకే చెప్పాడట. అయితే చివరకు ఆ సీన్‌ను సినిమాలో పెట్టలేకపోయాడట దర్శకుడు. మరి ఆ సీన్ ఏంటి? ఈ సినిమా స్టోరీ ఏంటి? అనేది అంతు పట్టడం లేదు. కథ వినకుండానే సినిమా చేస్తున్నాడా? అంటూ అజిత్ గురించి జనాలు అనుకుంటున్నారు.

Also Read : Gruhalakshmi Kasthuri : ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు!.. ముస్లింలు చేస్తే నేరం కాదు కానీ.. గృహలక్ష్మీ కస్తూరి

Also Read : Yash Daughter Ayra : రాకీ భాయ్ కూతురి బర్త్ డే.. యశ్ ఫ్యామిలీ పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News