Adipurush Movie Controversy: ఆదిపురుష్ మూవీ విడుదలైన తొలి రోజే వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా రామాయణాన్ని అవమానించడంతో పాటు రాముడు, సీత, రావణుడు, హనుమంతుడు పాత్రలపై పలు సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఢిల్లీ హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆదిపురుష్ సినిమాలో రాముడు, సీత, రావణుడు, హనుమంతుడు పాత్రలకు సంబంధించిన ఆ అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని హిందూ సేన అనే రైట్ వింగ్ గ్రూప్ జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఢిల్లీ హై కోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. ఆ అభ్యంతరకర సన్నివేశాలను తొలగించడం కానీ లేదా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా సరిదిద్దాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని విష్ణు గుప్తా తన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కోర్టుకు విజ్ఞప్తిచేశారు.
ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఆదిపురుష్ మూవీ శుక్రవారం దేశవ్యాప్తంగా 6500 పైగా థియేటర్లలో విడుదలైంది. అయితే, రామాయణంలోని పాత్రలకు, సినిమాలోని పాత్రలు భిన్నంగా ఉన్నాయని ఈ పిల్ దాఖలు చేసిన పిటిషనర్ పేర్కొన్నారు. 1952 సినిమాటోగ్రాఫ్ చట్టం కింద చిత్రానికి సెన్సార్ బోర్డు వారు జారీ చేసిన సర్టిఫికేషన్‌ను సవాలు చేయడంతో పాటు దర్శకుడు ఓం రౌత్, నిర్మాత, టిసిరిస్ అధినేత భూషణ్ కుమార్ లను ప్రతివాదులుగా చేర్చారు.
ఓం రావత్ తెరకెక్కించిన రామాయణం.. మహర్షి వాల్మీకి, తులసీదాస్ వంటి రచయితల రచనలలో కనిపించే వర్ణనలకు పరస్పర విరుద్ధంగా ఉందని.. " ఇది హిందూ సమాజం సెంటిమెంట్లను కించపర్చడమే అవుతుంది" అని విష్ణు గుప్త ఆవేదన వ్యక్తంచేశారు.
ఇది కూడా చదవండి : Adipurush first day collections: తొలి రోజు కలెక్షన్ల సునామీ సృష్టించిన ఆదిపురుష్... ఎంత వసూలు చేసిందంటే?
ఆదిపురుష్ మూవీలో సైఫ్ అలీఖాన్ పోషించిన రావణుడు పాత్రను, అలాగే హనుమంతుడు పాత్రలు వాస్తవికతకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి అని విష్ణుగుప్త తన పిల్ లో పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా రావణుడి పాత్రను గడ్డం లుక్ లో చూపించడం హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. హిందూ బ్రాహ్మణ రావణుడిని గడ్డంలో భయంకరంగా చూపించారు. ఇది హిందూ నాగరికతకు, హిందూ మతపరమైన ఆచారాలకు పూర్తి అవమానం అని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆదిపురుష్ మూవీ మేకింగ్‌కి వ్యతిరేకంగా దాఖలైన ఈ పిల్‌పై ఢిల్లీ హై కోర్టు ఏమని స్పందించనుందో వేచిచూడాల్సిందే మరి.
ఇది కూడా చదవండి : Adipurush Stopped in Nepal: నేపాల్‌లో ఆదిపురుష్ మూవీకి అడ్డంకులు
ఇది కూడా చదవండి : Adipurush Full HD Print Leaked: ఆదిపురుష్ ఫుల్ హెచ్‌డి ప్రింట్ లీక్.. ఇంటర్నెట్లో ఫుల్ మూవీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK