Anurag Kashyap అబద్ధాలు చెబుతున్నాడు.. లై డిటెక్టర్ టెస్టులు చేయండి: Payal Ghosh

తనపై నటి పాయల్ ఘోష్ (Payal Ghosh) చేసిన ఆరోపణలపై Anurag Kashyap ఇచ్చిన సమాధానాలను రికార్డ్ చేశారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap)‌ను వెర్సోవా పోలీసులు దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించారు.

Last Updated : Oct 2, 2020, 01:03 PM IST
Anurag Kashyap అబద్ధాలు చెబుతున్నాడు.. లై డిటెక్టర్ టెస్టులు చేయండి: Payal Ghosh

లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap)‌ను వెర్సోవా పోలీసులు దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం గురువారం ఆయన వాంగ్మూలాన్ని, తనపై నటి పాయల్ ఘోష్ (Payal Ghosh) చేసిన ఆరోపణలపై ఇచ్చిన సమాధానాలను రికార్డ్ చేశారు. అయితే పోలీసుల విచారణలో అనురాగ్ కశ్యప్ అబద్ధాలు చెబుతున్నారని మరో కొత్త వివాదానికి తెరతీసింది పాయల్ ఘోష్. 

తాను చెప్పిన తేదీలలో లైంగిక వేధింపులకు గురయ్యానని వివరాలు వెల్లడిస్తే.. అనురాగ్ కశ్యమప్ మాత్రం ఆ సమయంలో తాను విదేశాలలో ఉన్నానని చెప్పి తప్పించుకునే యత్నం చేస్తున్నారని ఆరోపించారు.  నిజనిజాలు బయటకు రావాలంటే అనురాగ్ కశ్యప్‌ని నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్, పాలిగ్రాఫ్ లాంటి టెస్టులు చేయాలని పోలీసులను కోరుతోంది లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన పాయల్ ఘోష్. ఇందుకు సంబంధించి మీకు లాయర్ ద్వారా సంబంధిత అప్లికేషన్ సైతం ఇస్తానని చెబుతోంది. బేటీ బచావో అని హ్యాష్ ట్యాగ్‌తో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ట్యాగ్ చేసింది.

న్యాయం జరగాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని పాయల్ అభిప్రాయపడుతోంది. సినిమా ఆఫర్ల కోసం వెళ్లిన తనను కొన్నేళ్ల కిందట అనురాగ్ కశ్యప్ లైంగికంగా వేధించాడని, దుస్తులు సైతం విప్పబోయాడండూ సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. 2013 ఆగస్టులో షూటింగ్ నిమిత్తం తాను శ్రీలంకకు వెళ్లానని ఆధారాలు సమర్పించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News