మహానటిపై కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

లవ్ స్టోరీ పాత్రలకే పరిమితమైన నటి కీర్తి సురేష్ (Keerthy Suresh)‌కు పేరు తెచ్చిన సినిమా మహానటి. ఈ సినిమాకు ఎందరినో అనుకున్నా చివరికి కీర్తి సురేష్ ‘మహానటి’ సావిత్రి బయోపిక్‌లో ఆమె పాత్రకు జీవం పోశారు.

Last Updated : Jun 9, 2020, 02:17 PM IST
మహానటిపై కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

కెరీర్ తొలినాళ్లలో కేవలం అందం, లవ్ స్టోరీ పాత్రలకే పరిమితమైన నటి కీర్తి సురేష్ (Keerthy Suresh)‌కు పేరు తెచ్చిన సినిమా మహానటి. ఈ సినిమాకు ఎందరినో అనుకున్నా చివరికి కీర్తి సురేష్ ‘మహానటి’ సావిత్రి బయోపిక్‌లో ఆమె పాత్రకు జీవం పోశారు. అయితే తాను మహానటి సినిమా చేయవద్దనుకున్నానంటూ హీరోయిన్ కీర్తి సురేష్ ఆసక్తికరవ్యాఖ్యలు చేసింది. మహానటి సినిమా ఇటీవల రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆమె ఇలా స్పందించింది. పోర్న్‌స్టార్‌గా మారిన నెంబర్ వన్ రేసర్

మహానటి (Mahanati) సినిమాలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్న కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుంది. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ సినిమాను చెప్పినప్పుడు కాస్త బయపడినట్లు ఆసక్తికర విషయాలు తెలిపింది. మహానటి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు ప్రియాదత్, స్వప్నాదత్, కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ వీడియో కాల్ ద్వారా ముచ్చటించారు. కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు నాగ్ అశ్విన్ నాకు నాలుగు గంటలకుపైగా మహానటి కథ చెప్పాడు.  బాలీవుడ్ నటి టాప్ 10 Bikini Photos

ఇలాంటి కథ వినగానే చాలా భయమేసింది. అసలే సావిత్ర అంటే మహానటి. ఆమెకు ఎందరో అభిమానులున్నారు. ఈ పాత్రను నేను చేయలేనని నాగ్ అశ్విన్‌కు చెప్పేశా. సావిత్ర పాత్రను చాలా ఉన్నతంగా, హుందాగా చేయాల్సి ఉంటుందని చెప్పా. అయితే దర్శకుడు నాపై నమ్మకం ఉంచారు. నువ్వు చేయగలవన్న నమ్మకం ఉందని ప్రోత్సహించడంతో మహానటి సినిమాకు ఓకే చెప్పానని’ ఆసక్తికర విషయాలు నటి కీర్తి సురేష్ వెల్లడించింది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

Trending News