7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 7వ వేతనసంఘం ప్రకారం ఉద్యోగుల జనవరి 2023 డీఏ పెంపుపై ఇవాళ నిర్ణయం తీసుకోవచ్చు. డీఏ ఎంత ఉంటుందనేది అధికారికంగా వెల్లడి కానుంది. డీఏ పెంపుతో బాటు జీతభత్యాలు కూడా పెరగనున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి 2023 డీఏ పెంపు ప్రకటన కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి హోలీకు ముందే డీఏ పెంపు ప్రకటన ఉండవచ్చని భావించినా సాధ్యం కాలేదు. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో డీఏ పెంపుపై నిర్ణయం ఉండవచ్చు. ఏఐసీపీఐ సూచీ ప్రకారం జనవరి 2023 లో 0.5 పాయింట్లు పెరిగి 132.8కు చేరుకుంది. గత నెలతో పోలిస్తే 0.38 శాతం అధికం. అదే ఏడాది క్రితంతో పోలిస్తే 0.24 శాతం తక్కువ.
మీడియా నివేదికల ప్రకారం డీఏ అంటే కరవు భత్యం 3 శాతం పెరగవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే 38 నుంచి 41 శాతానికి డీఏ చేరుతుంది. డీఏ 41 శాతానికి చేరుకుంటే నెలకు 7,380 రూపాయలు డీఏ ఉంటుంది.38 శాతం డీఏ ప్రకారం నెలకు 6,840 రూపాయలుంది. అంటే నెలకు 900 పెరగనుంది. దీనికి ఏడాదికి లెక్కగడితే 10,800 రూపాయలు పెరగినట్టే.
డీఏ 41 శాతానికి చేరుకుంటే నెలవారీ జీతం 23,329 రూపాయలుండవచ్చు. 38 శాతం డీఏ ప్రకారం నెలకు జీతం 21,622 రూపాయలుంది. పెరిగిన దాని ప్రకారం నెలకు 1707 రూపాయలు పెరుగుతుంది. ఏడాదికి లెక్కగడితే 20 వేల 484 రూపాయలవుతుంది.
ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ జూన్ 2022 నాటికి 12 నెల సరాసరి సూచీ పరిశీలిస్తే జూలై 1, 2022 నుంచి 4 శాతం అదనంగా డీఏ పెంపు లభించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది వర్తిస్తుంది. వివిధ అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏలో అదనపు పెరుగుదల ప్రభావం ఏడాదికి 6,591,36 బిలియన్లు కాగా 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 4,394.24 బిలియన్లుగా ఉంది.
ఇక కరవుభత్యంలో రిలీఫ్ పెరుగుదల ఆర్ధికంగా గణనీయ ప్రభావాన్ని చూపిస్తుంది. మొత్తం 6,261.20 బిలియన్ల అదనపు భారమౌతుంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 4,174.12 బిలియన్లు భారంగా ఉంటుంది. డీఏ పెంపు భారం ప్రభుత్వ ఖజానాపై ప్రతియేటా 12, 852.56 బిలియన్లుగా ఉంది.
Also read: SBI Interst Rate: ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుంచే అమలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook