Vikkatakavi Web Series Review: విక్కటకవి వెబ్ సిరీస్ రివ్యూ.. ఆకట్టుకునే విలేజ్ డిటెక్టివ్ డ్రామా..!

Vikkatakavi Web Series Review: గత కొన్నేళ్లుగా జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిఫరెంట్ కాన్సెప్ట్ కంటెంట్ ను ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మరో డిఫరెంట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ డిటెక్టివ్ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘విక్కటకవి’. జీ5లో నేటి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా లేదా రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 28, 2024, 01:00 PM IST
Vikkatakavi Web Series Review: విక్కటకవి వెబ్ సిరీస్ రివ్యూ.. ఆకట్టుకునే విలేజ్ డిటెక్టివ్ డ్రామా..!

Vikkatakavi Web Series Review:ఈ మధ్యకాలంలో 1940 నుంచి 70 మధ్య కాలంలో జరిగిన కథలను సినిమాలుగా.. వెబ్ సిరీస్ లుగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ కోవలో 1970 తెలంగాణ నేపథ్యంలో  డిటెక్టివ్ థ్రిల్లర్ తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘విక్కటకవి’. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఈ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా లేదా మన రివ్యూలో లుక్కేద్దాం..

కథ విషయానికొస్తే..

కథ విషయానికొస్తే.. ఈ వెబ్ సిరీస్ 1970ల కాలం నేపథ్యంలో తెరకెక్కించారు. అప్పటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకునే రామకృష్ణ (నరేష్ అగస్త్య) తన కాలేజీకి సంబంధించిన పలు సమస్యలను ఎంతో చాకచక్యంగా పరిష్కరిస్తూ ఉంటాడు.
ఈ నేపథ్యంలో వాళ్ల యూనివర్సిటీకి సంబంధించిన ఓ ఫ్రొఫెసర్.. ఒక ఊరిలోని ప్రజలు దేవతల గుట్ట అనే ప్రదేశానికి వెళ్లినపుడు తమ జ్ఞాపక శక్తిని కోల్పోతూ ఉంటారు. ఆ కేసును చేధించడానికి వెళ్లిన రామకృష్ణకు  ఆ ఊర్లో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి ?ఈ క్రమంలో ఆ ఊరి సమస్యను రామకృష్ణ పరిష్కరించడా.. ? లేదా అనేది తెలియాంలే  ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు ప్రదీప్ మద్దాలి.. సాయి తేజ్ ఇచ్చిన కథను అంతే అత్యద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా తెలంగాణ నేపథ్యం.. ఉస్మానియా యూనివర్సిటీలో చదవులు.. ఆనాటి కాలం నాటి పరిస్థితులను తెరపై చూపించాడు. నిజంగా  ఈ కాలంలో ఉన్నామా అనే రీతిలో కాస్ట్యూమ్స్ నుంచి సెట్స్ వరకు ప్రతి విషయంలో దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు.  తెలంగాణ నేపథ్యంలో తెలుగులో ఫస్ట్ టైమ్ తెరకెక్కిన డిటెక్టివ్ థ్రిల్లర్  విక్కటకవి. స్వాతంత్య్రం రాక మునుపు మ‌న దేశంలో చాలా సంస్థానాలుండేవి. అలాంటి వాటిలో తెలంగాణ‌కు చెందిన అమ‌ర‌గిరి  సంస్థానం ఒక‌టి. అప్పట్లో ప్రభుత్వం శ్రీశైలం డ్యామ్ కారణంగా త్వరలో ఆ ఊరు మునగబోతుంది. విక్కటకవిగా శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో తెనాలి రామకృష్ణుడు గూఢచారిగా పరిచేశారు. బహమనీ సుల్తానుల నుంచి రాయలవారి రాజ్యాన్ని కాపాడారు. ఆ తరహా కాన్సెప్ట్ తో ఓ ఊరిని కాపాడుకోవడానికి రామకృష్ణ  ఏం చేసాడు.రచయత దతేజ దేశరాజ్ కథలో అనే క్లిష్టమైన ఉప కథలను, చారిత్రక నేపథ్యమున్న సంఘటను చక్కగా తెరపై ఆవిష్కరించాడు. అత్యంత భారీ కథను ఓటీటీ బడ్జెట్ లో ప్రేక్షకులు మెచ్చేలా

ముఖ్యంగా అజయ్ అరసాడ ఈ సిరీస్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.  షోయబ్ సిద్దీఖీ డైరెక్ట్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాగుంది. అమరిగిరి వరల్డ్ ను చూపించడంలో సక్సెస్ అయ్యాడు.  కాస్ట్యూమ్ డిజైనర్ గాయత్రి దేవి,  ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్ మామిడి  పనితీరుతో అట్రాక్ట్ చేసారు. ఎడిటర్ సాయిబాబు తన పనితనం చూపించాడు.

నటీనటుల విషయానికొస్తే..
నరేశ్ అగస్త్య డిటెక్టివ్ పాత్రలో ఒదిగిపోయాడు. అంతేకాదు ఈ పాత్రకు ఎంతో ఈజ్ తో చేసి చూపించాడు. ఈ సిరీస్ లో రాజా పాత్రలో  తన టాలెంట్ తో  తన జీవితంలో కోల్పోయిన వయసైన రాజా నరసింహరావు పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు.
రఘు కుంచె, మేఘా ఆకాష్, సహా మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.

చివరి మాట: ఈ వీకెండ్ లో ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే ‘విక్కటకవి’..

రేటింగ్: 3/5

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News