Youtuber Shanmukh: గంజాయితో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన యూట్యూబర్ షణ్ముఖ్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Youtuber Shanmukh: ఎపుడు తన యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్‌తో పాపులర్ అయిన మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఈ సారి తన ఫ్లాటులో గంజాయితో పోలీసులకు పట్టుబడటం సంచలనం రేపుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 22, 2024, 12:05 PM IST
Youtuber Shanmukh: గంజాయితో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన యూట్యూబర్ షణ్ముఖ్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Youtuber Shanmukh: ప్రముఖ యూట్యూబర్ మరోసారి పోలీసుకులకు అడ్డంగా దొరికిపోయాడు. అది కూడా గంజాయితో పట్టుపడటం సంచలనం రేపుతోంది. ఓ కేసు విచారణలో భాగంగా పోలీసుల దగ్గరకు వెళితే గంజాయితో పట్టుబడ్డాడు. ఆరు రోజుల్లోనే ఇతనికీ అన్నకు ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఇంతలోనే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయమై సదరు యువతి షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ పై మోనిక అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంపత్ వినయ్ కోసం అతను ఉంటున్న ఫ్టాటుకు పోలీసులు వెళ్లగా.. అక్కడ తనిఖీల్లో షణ్ముఖ జస్వంత్ గంజాయితో పట్టబడ్డాడు. దీంతో పోలీసులు షణ్మఖ్‌తో పాటు అతని అన్న సంపత్ వినయ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంతేకాదు ఈ గంజాయి ఎవరిచ్చారు. ఎక్కడ నుంచి వచ్చిందనే విషయమై ఆరా తీస్తున్నారు.

షణ్ముఖ్ జస్వంత్ విషయానికొస్తే..  యూట్యూబ్‌లో రెగ్యులర్ ఇతని వీడియోలు చూసే వాళ్లకు తెలుసు. అతని యూట్యూబ్ వీడియోలకు లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. ముఖ్యంగా ఇతిని యూట్యూబ్‌కు 3 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌లో కోటి 20 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇతనికి యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల నుంచే నెలకు రూ. 10 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా తన డాన్స్ మూమెంట్స్, యూట్యూబ్‌ వీడియోలతో పాపులర్ అయ్యాడు. ఆ మధ్య కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా చేసాడు. ఆయన లీడ్ రోల్లో యాక్ట్ చేసిన 'సాఫ్ట్‌వేర్ డెవలపర్' అనే వెబ్ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు యూట్యూబ్ వీడియోలతో వచ్చిన పాపులారిటీతో బిగ్‌బాబస్‌ హౌస్‌లోకి కూడా అడుగుపెట్టాడు.

ఆ మధ్య అతివేగంతో కారు నడిపి కొన్ని వాహనాలను ఢీకొట్టిన సంఘటన అప్పట్లో పెద్ద సంచలనే సృష్టించింది. మద్యం తాగిన మత్తులో షణ్ముఖ్ ఈ పని చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అప్పట్లో పోలీసులు అతని కారును స్వాధీనం చేసుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం షణ్ముఖ్ పై ఈ కేసు నడుస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా తన ఫ్లాటులో గంజాయితో పట్టుబడటం ఇపుడు సంచలనం రేపుతోంది.  

Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News