KGF Chapter 2 Record: బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన 'కేజీఎఫ్ చాప్టర్ 2'.. 15 శాతం ఎక్కువ!

KGF Chapter 2 breaks Baahubali 2 record in Hindi. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కేజీఎఫ్‌ 2 హిందీ వెర్షన్లో రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. ఏకంగా బాహుబలి రికార్డ్‌నే బద్దలు కొట్టింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2022, 07:41 PM IST
  • రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోన్న కేజీఎఫ్ 2
  • బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన కేజీఎఫ్ 2
  • బాహుబలి కంటే 15 శాతం ఎక్కువ
KGF Chapter 2 Record: బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన 'కేజీఎఫ్ చాప్టర్ 2'.. 15 శాతం ఎక్కువ!

KGF Chapter 2 Movie breaks Baahubali 2 in Hindi advance booking collections: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2'. 2018లో విడుదలైన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హిరోయిన్‌గా నటించారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కేజీఎఫ్ 2 పలు కారణాల  వల్ల వాయిదా పడుతూ వచ్చి.. ఎట్టకేలకు ఈరోజు (ఏప్రిల్ 14) విడుదలైంది. బాక్సాఫీసు వద్ద హిట్‌ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది.  

ప్రపంచవ్యాప్తంగా 10వేల స్క్రీన్స్‌పై కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 సినిమా విడుదలైంది. భారత్‌లో 6 వేల థియేటర్లలో రిలీజ్ కాగా.. దక్షిణాదిలో 2600 థియేటర్లలో బొమ్మ పడింది. ముఖ్యంగా కేజీఎఫ్‌ 2 హిందీ వెర్షన్లో రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. ఏకంగా బాహుబలి రికార్డ్‌నే బద్దలు కొట్టింది. తొలి రోజు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కలెక్షన్స్‌లో బాహుబలి 2 సినిమా హిందీలో రూ. 37.5కోట్లు వసూళ్లు సాధించగా.. కేజీఎఫ్ 2 రూ. 38కోట్లు కొల్లగొట్టి రికార్డు సాధించింది. దాంతో బాక్సాఫీస్ రికార్డుల్లో సరికొత్త మైల్‌స్టోన్ నెలకొల్పింది. బాహుబలి 2తో పోలిస్తే 15 శాతం అదనంగా రూ. 21.50 కోట్లు నెట్ వసూళ్లు సాధించింది కేజీఎఫ్‌ 2. 

కేజీఎఫ్ సిరీస్‌కి చాప్ట‌ర్-2 ఎండింగ్ కాదని తెలుస్తుంది. చాప్ట‌ర్‌ 2 క్లైమాక్స్‌లో కేజీఎఫ్ మూడో భాగం కూడా ఉండ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ఓ హింట్ ఇచ్చింది. స‌ముద్రంలో హీరో యష్ వ‌స్తుంటే.. అత‌డి షిప్‌ను రెండు దేశాల అధికారులు వెంబ‌డిస్తారు. దాంతో మూడో భాగంలో రాఖీ భాయ్ సామ్రాజ్యం ఇంట‌ర్ నేష‌న‌ల్ లెవ‌ల్లో ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేజీఎఫ్ 3 అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. 

హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్ కిరగందూర్ కేజీఎఫ్‌ 2 సినిమాను నిర్మించారు. రవి బస్రూర్‌ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ లతో పాటు ప్రకాష్‌రాజ్, రావు రమేష్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన కేజీఎఫ్‌ 2.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డబ్ చేశారు. 

Also Read: KGF Chapter 2 OTT Release Date: అభిమానులకు గుడ్ న్యూస్.. 'కేజీయఫ్ 2' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!

Also Read: Salaar Movie: కేజీఎఫ్ 2 థియేటర్లలో 'సలార్' సందడి.. ఆశ్చర్యపోయిన ఫ్యాన్స్‌! వచ్చే నెలలో బిగ్ ట్రీట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Facebook , Twitterమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News