Yamadheera Trailer Launch: క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ 'యమధీర'.. ట్రైలర్ విడుదల..

Yamadheera Trailer Launch: శాండిల్ వుడ్ హీరో కోమల్ కుమార్ హీరోగా.. భారత క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తోన్న సినిమా 'యమధీర'. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తోన్న ఫస్ట్ మూవీ. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 18, 2024, 05:02 PM IST
Yamadheera Trailer Launch: క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ 'యమధీర'.. ట్రైలర్ విడుదల..

Yamadheera Trailer Launch: 'యమధీర' మూవీ విషయానికొస్తే.. ఈ సినిమాలో కోమల్ కుమార్, శ్రీశాంత్‌తో పాటు ఇతర ముఖ్యపాత్రల్లో నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూధన్  తదితరులు నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్ ఫిల్మ్ ఛాంబర్‌లో చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ , తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ, నిర్మాత డి. ఎస్. రావు, పి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 

ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ..

వేదాల శ్రీనివాస్ ప్రొడ్యూసర్‌గా  శంకర్ దర్శకుడిగా చేస్తూ కన్నడ సినిమాగా తీసి తెలుగులో వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో మన తెలుగువారైన నాగబాబు,మధుసూదన్ , ఆలీ, సత్య ప్రకాష్ వారు నటించడంతో ఇది ఒక తెలుగు సినిమాలాగే అనిపిస్తోంది. యమధీర టైటిల్ కూడా చాలా క్యాచీగా ఉంది. యమ గతంలో మన యమదొంగ, యమలీల, యమగోల వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.  అదేవిధంగా ధీర మగధీర లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఉంది. కోమల్ కుమార్ కూడా పోలీస్ ఆఫీసర్ గా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. మొత్తం అంతా కూడా ఫారిన్ లొకేషన్స్ లో చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. గతంలో విజయ్ సర్కార్ మూవీ లాగే ఇది కూడా పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీగా తెరకెక్కించారు. ఈవీఎం ల ట్యాంపరింగ్, పోలింగ్ తదితరల విషయాల  గురించి ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా టెక్నికల్ వాల్యూస్ తో ఈ యమధీర సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. వేదాల శ్రీనివాస్ ఫ్యూచర్‌లో  ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ఈ జనరేషన్ కి కొత్త అవకాశాలు ఇవ్వాలని అదేవిధంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ మాట్లాడుతూ..
యమధీర టైటిలే చాలా క్యాచీగా ఉంది.  ప్రసన్నకుమార్  జీ యముడు మీద వచ్చిన టైటిల్ చెప్తూ యముడికి మొగుడు టైటిల్ మర్చిపోయారు. యముడు టైటిల్స్ మీద వచ్చిన సినిమాలన్నీ కూడా పెద్ద సక్సెస్ అయ్యాయి. వేదాల శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి. కోమల్ కుమార్ హీరోగా మనందరికీ తెలిసిన క్రికెటర్ శ్రీశాంత్ విలన్ గా ఈ సినిమా నిర్మించారు. మంచి విదేశీ లొకేషన్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తెరకెక్కించారు. మన తెలుగువారు నాగబాబు, అలీ  లాంటివాళ్ళు నటించిన పదహారణాల తెలుగు సినిమా ఇది. చిన్న సినిమాలని ప్రమోట్ చేయడంలో ఎప్పుడూ ముందుండే పి ఆర్ ఓ, జర్నలిస్ట్ మధు ఈ సినిమాని చాలా చక్కగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రేక్షకులు సినిమాకి పెద్ద విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

నిర్మాత డి. ఎస్. రావు మాట్లాడుతూ :
యమధీర ఈనెల 23న విడుదల అవుతోంది. కన్నడ సినిమా అయిన అచ్చమైన తెలుగు సినిమాల ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాని నిర్మించారు. ఎలక్షన్స్ గురించి ఈవీఎం ల ట్యాంపరింగ్ గురించి ముఖ్యంగా ఈ సినిమాలో ఎంతో చక్కగా చూపించారు. వేదాల శ్రీనివాస్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

పి. శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ :
శ్రీ మందిరం ప్రొటెక్షన్ పై వేదాల శ్రీనివాస్ నిర్మాతగా యమధీర సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఇందాక ప్రసన్నకుమార్  చెప్పినట్టు రామ్ సత్యనారాయణ  చెప్పినట్టు ఇది తెలుగుదనం ఉట్టిపడుతున్న సినిమా. ఒక మంచి కాన్సెప్ట్ తో ఇప్పటి ట్రెండుకు తగినట్టుగా ఎలక్షన్స్ గురించి వివరిస్తూ ఈ సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకి పెద్ద విజయం చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

నిర్మాత వేదాల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ :

నేను అడగగానే ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన  టి ఎఫ్ పి సి సెక్రటరీ ప్రసన్నకుమార్‌కి ట్రెజరర్ రామ సత్యనారాయణకి, డి. ఎస్. రావు గారికి, పి. శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ యమధీర ఫిలిం ఈవీఎం ట్యాంపరింగ్ పైన తెరకెక్కించాము. అజర్ బైజాన్ కంట్రీ లో ఎక్కువ శాతం షూట్ చేసాము. 100 సినిమాల్లో నటించిన కోమల్ కుమార్, క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్య పాత్రలో నటించారు. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకి సినిమాను తీసుకురాబోతున్నాం. ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

ఇదీ చదవండి: తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి .

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News